నేను వ్యతిరేకించేది ఇందుకే….

పరకాల నియోజకవర్గంలో ఉద్యమకారునికి టికెట్ కేటాయిస్తే ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు…గుడెప్పాడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు …గులాబీ పార్టీలో మొదటినుంచి ఉన్నవారిని కాదని తన కోటరిని పెంచుకునే ప్రయత్నం ఎమ్మెల్యే చల్లా చేస్తున్నారని ఆయన ఆరోపించారు…ఉద్యమకారులకు చల్లా ద్వారా ఎలాంటి న్యాయం జరగలేదని తెలంగాణ ఉద్యమ కారులకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి ముమ్మాటికీ అన్యాయం చేశారంటున్న విష్ణుతో మా న్యూస్10 ప్రతినిధి నమిండ్ల ప్రమోద్ ఫటాపట్ ఇంటర్వ్యూ…..

న్యూస్ -10: ధర్మారెడ్డిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

గజ్జి విష్ణు: పరకాల నియోజకవర్గంలో ఉద్యమకాలం నుండి పనిచేస్తున్న నిఖార్సయిన తెరాస నాయకులకు సరైన గుర్తింపు లేదు. పార్టీ పదవుల్లో నామినేట్ పదవుల్లో తీవ్ర అన్యాయం జరిగింది.నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు ఇతర పార్టీ ల నుండి వచ్చిన వారినే అధ్యక్షులు గా నియమించారు. నియోజకవర్గంలో మొదటి నుండి గులాబీ జెండా మోసిన నిఖార్సయిన కార్యకర్తల్లో ఎంతమందికి సర్పంచిగా, ఎంపిటిసి గా, జెడ్పీటీసీ గా, ఎంపిపి లుగా ,కార్పొరేటర్ లుగా, కౌన్సిలర్ లుగా అవకాశం కల్పించారో ధర్మారెడ్డి సమాధానం చెప్పాలి.ధర్మారెడ్డి పార్టీలోకి రాకముందు తెరాసలో మండల పార్టీ అధ్యక్షులు లేరా?అప్పుడు పార్టీ నడవలేదా?నియోజకవర్గంలో దాదాపు 70 శాతానికి పైగా ప్రతి పదవుల్లో ఇతర పార్టీ& తనతో వచ్చిన వారినే నియమిస్తూ నిఖార్సయిన మొదటి నుండి గులాబీ జెండా మోసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం చేసారు అందుకే నేను స్థానిక ఎమ్మెల్యే ను వ్యతిరేకిస్తున్న .

న్యూస్-10: పరకాల నియోజకవర్గంలో ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం ఉందా?

గజ్జి విష్ణు: నియోజకవర్గంలో ఉద్యమకారులకు ప్రాధాన్యం లేదు కేసీఆర్ పిలుపు మేరకు 2001 నుండి కష్ట నష్టాలను ఎదుర్కొని గులాబీ జెండా మోసిన నాయకులను తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది. ధర్మారెడ్డి పార్టీని అభివృద్ధి చేయడంలేదు తన సొంత కోటరీని నిర్మించుకుంటున్నాడు. భవిష్యత్ లో ఏ కారణం చేతనన్న తను పార్టీ వీడితే బీఆర్ఎస్ లో ఎవరూ లేకుండా ఉండేందుకే అన్ని పదవుల్లో తనతో వచ్చిన వారికి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికే పార్టీ పదవులు ఇచ్చాడు. ఉద్యమకారులో ఒకరిద్దరికి పదవులు ఇస్తే ఉద్యమకారులకు ప్రాధాన్యం ఉన్నట్టా? 2019 ఎలక్షన్ ముందు ఉద్యమంలో జైలు జీవితం గడిపిన గొర్రెకుంట, ధర్మారం కు చెందిన 8 మంది విద్యార్థి ఉద్యమకారులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎమ్మెల్యే చల్లా వారిని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు తీసుకెళ్లగా మంత్రి కేటీఆర్ స్పందించి 3 నెలల్లో ఈ 8 మందిని నా దగ్గరకు తీసుకురా వారికి ప్రభుత్వం తరుపున న్యాయం చేద్దాం అని ఆదేశించినా ఇప్పటివరకు వారిని కేటీఆర్ వద్దకు ఈ ఎమ్మెల్యే తీసుకుపోలేదు.ఎంతో మంది ఉద్యమకారులు ప్రజాప్రతినిదిగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తన కోటరికే ఈ ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాడే తప్ప ఏ ఉద్యమకారున్ని పట్టించుకున్న పాపాన పోలేదు.స్వయంగా నేను ఎన్నో సార్లు ఉద్యమకారుల విషయం ప్రస్తావించినప్పటికి వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి

న్యూస్-10: బీఆర్ఎస్ పార్టీ నుండి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేశారు?

గజ్జి విష్ణు: నేను ఒక దళిత కుటుంబానికి చెందిన బిడ్డను నియోజకవర్గంలో అనేక మంది యువకులు ,మొదటినుండి ఉద్యమంలో పాల్గొన్న తెరాస కార్యకర్తలు వారికి పార్టీలో జరుగుతున్న అన్యాయం పై నాతో పంచుకున్నారు అదే విషయాన్ని నేను సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్యే ను ప్రశ్నిస్తున్నా, నియోజకవర్గంలో అనేక చావుబతుకుల కు వెళ్లి నాకు తోచిన సహకారం అందిస్తున్న అది తట్టుకోలేకనే ఎమ్మెల్యే కావాలనే నన్ను సస్పెండ్ చేసినట్లు ప్రకటన ఇప్పించారు .పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేసే అధికారం ఎమ్మెల్యే కు లేదు నేను నియోజకవర్గంలో గులాబీ జెండాకు వారసున్ని అయినా ఆ సస్పెన్షన్ చెల్లదు.

న్యూస్-10: పరకాల నియోజకవర్గం అభివృద్ధి లో దూసుకుపోతుంది అది ఎమ్మెల్యే ధర్మారెడ్డి కృషి కాదా?

గజ్జి విష్ణు: పరకాల నియోజకవర్గం తెరాస ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందుతుంది.అది ధర్మారెడ్డి కృషి అంటే నేను ఒప్పుకోను. వాస్తవానికి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పటినుండి ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని నేను చెప్తున్నా. పరకాల బీఆర్ఎస్ పార్టీ నుండి ధర్మారెడ్డి స్థానంలో ఇంకెవరు ఎమ్మెల్యే గా ఉన్నా ఇదే అభివృద్ధి జరిగేది ఎందుకంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణ మొత్తాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారు

న్యూస్-10:బీఆర్ఎస్ అధిష్టానం నుండి మీకు పిలుపు వస్తే ఏం చెప్తారు?

గజ్జి విష్ణు: బీఆర్ఎస్ పార్టీ మా అధిష్టానం నుండి నాకు పిలుపు వస్తే కనుక ఖచ్చితంగా ధర్మారెడ్డి ని నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నానో స్పష్టంగా వివరిస్తా.. నియోజకవర్గంలో దళిత,మైనార్టీ, బహుజనులంటే ఎమ్మెల్యే కు ఎంత చులకనో చెప్పే ప్రయత్నం చేస్తా ధర్మారెడ్డి ఉద్యమకారులను ఎలా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో తెలుపుతా… ఈ సారి ఎన్నికల్లో ఉద్యమం తెలిసిన నాయకులకు, ఉద్యమకాలంలో పార్టీకి అండగా ఉన్న నాయకులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here