ఎంపీ “స్వప్న”o

మొన్నటివరకు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తుందని ప్రచారం జరిగిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి స్వప్న తన రూట్ మార్చుకున్నట్లు తెలుస్తుంది….ఇప్పుడు వరంగల్ ఎం పి స్థానం పై తాను కన్నేసినట్లు తెలుస్తోంది…ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ది స్థానంలో తాను బరిలో నిలువబోతుందని పుకార్లు బాగానే వినిపించాయి….ఈ పుకార్లను పెద్ది దంపతులు సైతం ఎక్కడ ఎప్పుడు కొట్టి పారేయలేదు కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ది స్వప్న వరంగల్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు గులాబీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది….

“పసునూరి”ని మార్చితే….?

ప్రస్తుతం వరంగల్ ఎంపీ గా వరుసగా రెండోసారి కొనసాగుతున్న వరంగల్ ఎంపీ ని ఈ స్థానం నుంచి మార్చితే తాను బరిలో నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పెద్ది స్వప్న తన సన్నిహితుల వద్ద డైలాగ్ ఓపెన్ ఐయినట్లు తెలిసింది….పసునూరి ని అధిష్టానం మార్చితే తనకు వరంగల్ ఎంపీ ఖాయమని పెద్ది స్వప్న ధీమాగా ఉన్నట్లు సమాచారం….మరోవైపు నర్సంపేట స్థానం నుంచి పెద్ది మరోసారి బరిలో నిలిస్తే వరంగల్ ఎంపీ గా పసునూరిని మార్చే ప్రయత్నం చేస్తే ఆ స్థానంలో పెద్ది స్వప్నకు టికెట్ రావడం ఖాయమేనా…?అనే వాదన సైతం జరుగుతుంది….ఒకే ఇంటినుంచి ఇద్దరికి అవకాశం వచ్చేనా…..? అనేది సందేహంగానే కనపడుతుంది….అంతేకాదు ఒకవేళ అవకాశం వచ్చి పెద్ది స్వప్న కు ఎంపీ గా పోటీచేసే అవకాశం వస్తే వరంగల్ పార్లమెంట్ పరిధిలోని వరంగల్ తూర్పు,వరంగల్ పశ్చిమ,స్టేషన్ ఘనపూర్, భూపాలపల్లి,పరకాల నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు సహకరిస్తార….?అనేది సందేహంగ ఉన్నట్లు అప్పుడే గులాబీ వర్గాల్లో టాక్ మొదలయింది….అంతేకాదు ఎంపీ గా పెద్ది స్వప్న ఎం పి టికెట్ ఆశించడం,బరిలో నిలవాలని అనుకోవడం పట్ల ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సుముఖంగా ఉన్నారా….?అనేది ఇంకా తెలియాల్సివుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here