దళితుడి భూమికి దిక్కేది….?

బి ఆర్ ఎస్ పార్టీలో డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసి అనారోగ్యంతో మరణించిన ఓ దళిత రాజకీయ నాయకుడి భూమికి ఇప్పుడు దిక్కులేకుండాపోయింది….తిమ్మాపూర్ రామగోపాలపురం,ఖిలా వరంగల్ మండలం లోని సర్వే నంబర్ 245/4 గల ఖమ్మం ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వీరి భూమిలో బీజేపీ కి చెందిన ఓ నాయకుడు మొరం పోసి చదునుచేసి చుట్టూ ప్రహారి గోడ నిర్మించి ఆక్రమించుకున్నాడని గులాబీ నాయకుడి భార్య ఆరోపిస్తోంది…భూమి విషయంలో తనకు జరిగిన అన్యాయం విషయంలో న్యూస్10 కు ఆమె తన గోడు వెళ్లబోసుకుంది… తనకు వెనకముందు ఎవరులేరని బీజేపీ కి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఆక్రమించి తమను బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది… ఈ ఆక్రమణ విషయం గూర్చి తన భర్త బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు
యాడాల హరి ప్రసాద్ అధికారులకు ఫిర్యాదు చేసిన లాభం లేకుండా పోయిందని…తన భూమి తాను దక్కించుకోవడం కోసం తన భర్త తిరిగి వేసారి అనారోగ్యంతో చనిపోయారని ఆమె కన్నిటిపర్యంతమయ్యింది…

ఎమ్మెల్యే చొరవచూపాలి

తన భర్త బ్రతికున్నంతకాలం బిఆర్ ఎస్ పార్టీ కోసం ఎంతో బాగా పనిచేశారని అతను మరణించిన తర్వాత తమను పట్టించుకునే వారేలేరని అంది… తన భర్త మరణిస్తే కార్యక్రమాలన్నింటికి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహాయం చేశాడని తెలిపింది… విలువైన తమ భూమిని బీజేపీ నాయకుడు ఆక్రమించి ముప్పుతిప్పలు పెడుతున్నాడని ఈ విషయంలో ఎమ్మెల్యే ఆరూరి చొరవ చూపి తమను ఆదుకోవాలని ఆమె ఎమ్మెల్యే ను వేడుకుంది…. తమ జరిగిన అన్యాయంపై ఎమ్మెల్యే ను కలిసి పిర్యాదు చేస్తామని అన్నారు….మట్టి వ్యాపారం చేసే బీజేపీ నాయకుడు టిప్పర్లు తమ భూమిలో పార్కింగ్ చేసుకుని భూమినే సొంతం చేసుకొని ఇప్పుడు భూమి మాది కాదని అంటున్నాడని ఆమె తెలిపింది…. బీజేపీ నాయకుడి భూ ఆక్రమణ విషయంపై పోలీస్ కమిషనర్ ను కలిసి పిర్యాదు చేసి న్యాయం చేయాలని వేడుకుంటామని ఆమె న్యూస్10 కు తెలిపింది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here