పేదోల్ల భూమికి బీజేపీ నేత ఎసరు…?

ఆయనో బీజేపీ నేత …రాష్ట్రం, కేంద్రంలో తనకు విస్తృత సంబంధాలు ఉన్నాయని పదే పదే చెప్పుకొనే నేత…రియల్టర్ గా,మట్టి వ్యాపారిగా అందరిలో గుర్తింపు ఉన్న నాయకుడు….పేదవారి భూమిని ఆక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు…. అధికారపార్టీ కి చెందిన ఓ పేద నాయకునికి సంబంధించిన భూమిని ఆక్రమించి బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది…. బాధితురాలు న్యూస్10 కు తెలిపిన వివరాల ప్రకారం….ఖిలా వరంగల్ తిమ్మాపూర్ హావేలిలో దళితుని భూమిని
బీజేపీ నేత తనకున్న పరపతితో కబ్జా పెట్టి ప్రహరీ గోడ కట్టి భాదితులకు చుక్కలు చూపెడుతున్నాడు….భూమి తనదే అంటూ బాధితులను అ(మ)ల్లాడిస్తున్నాడు….తనకు చెందిన భూమిని బీజేపీ నేత కబ్జా చేశాడని భూమికోసం సర్వ ప్రయత్నాలు చేసిన గులాబీ నేత అనారోగ్యం బారిన పడి మృతి చెందాడు…. పేద కుటుంబానికి చెందిన ఆ గులాబీ నాయకుడు మరణిస్తే అంత్యక్రియలకు సైతం డబ్బులు లేకుంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆర్థిక సహకారం అందించి దగ్గరుండి కార్యక్రమాలు అన్ని నిర్వహించారు….అంతటి కటిక పేదరికంలో ఉన్న ఆయనకు చెందిన భూమిని బీజేపీ నేత ఆక్రమించడంతో ఇప్పుడు ఆ భూమిని దక్కించుకోవడం కోసం గులాబి నాయకుడి భార్య ప్రయత్నాలు చేస్తోంది…. తమకు సంబంధించిన భూమిని బీజేపీ నాయకుడు ఆక్రమించుకున్నాడని ఆవేదన వ్యక్తంచేసింది….అక్రమంగా తన భూమిని ఆక్రమించుకున్నాడని అడిగితే తాను లీగల్ గా ఉన్నానని బెదిరింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది…. లీగల్ గా ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు చూపమంటే చూపడం లేదని బాధితురాలు తెలిపింది…. తన భర్త బ్రతికిఉన్నపుడు టిప్పర్ల పార్కింగ్ కోసమని భూమిని చదును చేసి పథకం ప్రకారం తమ భూమిని కొట్టేసాడని,అధికారులతో సహా అన్ని పార్టీల రాజకీయ నాయకులు తనకు తెలుసునని తనను ఎవరూ ఏమీ చేయలేరని తమను బెదిరిస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యింది….ఇప్పటికే తమకు సంబంధించిన ఎకరం భూమి కబ్జాకు గురికాగ …ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న భూమిని బీజేపీ నేత ఆక్రమించాడని భాదితురాలి తెలిపింది….తమ భూమి తమకు ఇప్పించాలని అధికారులను వేడుకుంటుంది…..

ఇదీ బీజేపీ నాయకుని కబ్జా కహానీ…..

ఎమ్మెల్యే ఆరూరి చొరవ చూపాలి

పూర్తి వివరాలు మరో సంచికలో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here