గురుకుల పాఠశాల, కళాశాల టెండర్ల లో గోల్ మాల్ చోటుచేసుకున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి…2023-24 విద్యాసంవత్సరానికి గాను గురుకులాలకు సరఫరా చేయాల్సిన వివిధ నిత్యాఅవసరాలు,క్యాటరింగ్,స్టేషనరి ఇతర పనులకు గాను గురుకులాల అధికారులు టెండర్ కు ఆహ్వానించారు…ఈ టెండర్ వేసి కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి పలువరు టెండర్ వేశారు….ఐయితే ఈ టెండర్ లు ఖరారు చేయడానికి అధికారులు టెండర్ లను పరిశీలించాల్సి ఉంది….కానీ ఓ కాంట్రాక్టర్ తిరిగి టెండర్ దక్కించుకోవడం కోసం అధికారులతో కలిసి తన పైరవి పనితనానికి పదును పెట్టారు… అధికారులను మచ్చిక చేసుకుంటే టెండర్ దక్కించుకోవచ్చని బాగా తెలిసిన ఈ కాంట్రాక్టర్ అధికారులకు దగ్గరగా ఉంటూ మరోసారి టెండర్ కోసం తన సర్వశక్తులు ఒడ్డుతున్నారట…
కారులో టెండర్ బాక్స్…
గురుకులాల పాఠశాలలు,కళాశాలల్లో వివిధ విభాగాల్లో సరుకులు, ఇతరాలు సరఫరా చేయడం కోసం ఔత్సాహికులు టెండర్ పత్రాలు దాఖలు చేయగా వాటిని ఓ బాక్స్ లో ఉంచారు…ఈ బాక్స్ ను హన్మకొండ జిల్లా కలెక్టర్ సమక్షంలో కలెక్టర్ కార్యాలయంలో తెరవాల్సివుంది… ఇందుకు సంబంధించిన బాక్స్ ను మడికొండ గురుకుల పాఠశాల నుంచి హన్మకొండ కలెక్టర్ కార్యాలయానికి తరలించాల్సి ఉండగా అధికారులు ఆ బాక్స్ ను మడికొండ గురుకుల కళాశాల,పాఠశాల నిత్యావసరాల సరఫరా కాంట్రాక్టర్ కార్ లొనే తరలించారు…ప్రభుత్వ అధికారిక గురుకుల పాఠశాల మరియు కళాశాలల టెండర్ ప్రక్రియలో మడికొండ డిస్టిక్ కోఆర్డినేట్ ఆఫీసర్ ,ప్రిన్సిపల్ ప్రభుత్వ నియమ నిబంధలను ఏమాత్రం పట్టించుకోకుండా కాంట్రాక్టర్ తో కుమ్మకై అదే గురుకుల పాఠశాలకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ సొంత కారులో ప్రభుత్వ టెండర్ బాక్సును కారులో తరలిస్తూ మడికొండ కాజీపేట మార్గమద్యంలో ఆపి టెండర్ బాక్స్ ను ఓపెన్ చేసి కుట్రకు పాల్పడినట్టుగా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు…ఆ బడా కాంట్రాక్టర్ కారులో టెండర్ బాక్స్ తీసుకొని
మడికొండ గురుకుల పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి , గురుకులాల డిస్టిక్ కోఆర్డినేట్ ప్రయాణం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది…కాంట్రాక్టర్ కారులో టెండర్ బాక్స్ తో అధికారులు ప్రయాణం చేయడం మార్గమధ్యంలో ఆగి టెండర్ పత్రాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారని ఆరోపణలు రావడం ఇప్పుడు పలు సందేహాలకు తావిస్తోంది… బడా కాంట్రాక్టర్ తిరిగి కాంట్రాక్ట్ దక్కించుకోవడం కోసం అధికారులతో కలిసి కుట్ర చేస్తున్నట్లు అర్ధమవుతుందని స్వేరోస్ స్టూడెంట్ యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మారపల్లి మనోజ్ కుమార్ న్యూస్10 తో అన్నారు…ఈ విషయంపై తాము జిల్లా కలెక్టర్ కు ఇతర అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు…కాంట్రాక్టర్ కారులో ట్రెండర్ బాక్స్ తో అధికారులు ప్రయాణం చేసి టెండర్ విషయంలో ఎదో కుట్రకు పాల్పడ్డారని తాము పిర్యాదు చేసిన ఇప్పటివరకు అధికారులెవరు స్పందించలేదన్నారు…కాంట్రాక్టర్,అధికారులపై చర్యలు తీసుకోకుంటే తాము ఆందోళన చేపడతామన్నారు… ఈ విషయంపై తాము సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల కార్యదర్శికి పిర్యాదు చేస్తామన్నారు….
అంతా “నారాయణ”మాయ
అధికారుల అండతో రెచ్చిపోతున్న ఆ కాంట్రాక్టర్
మరో సంచికలో……