కాంగ్రెస్ నేత సెటిల్ మెంట్ దందా…?

అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే నాకేంటి మనల్ని ఎవడ్రా ఆపేది…. అనుకుంటున్నాడో ఏమో ఈ నేత హనుమకొండ జిల్లాలోని ఓ కాంగ్రెస్ నేత నిత్యం సెటిల్మెంట్లు చేస్తూ ఇరువర్గాలకు మధ్యవర్తిత్వం వహిస్తూ రెండువైపులా కమిషన్లు నొక్కుతూ బాగానే సంపాదిస్తున్నాడట.పైసలు పోతే పోనీ కానీ సెటిల్మెంట్ పూర్తి చేసి ఇరువురికి న్యాయం చేస్తాడేమో అనుకునేరు… అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. రొట్టె ముక్క కోసం పిల్లులు కొట్లాడుతుంటే మధ్యలో వచ్చిన కోతి కథ ముగించినట్లే ఉంటుందట ఈయన గారి యవ్వారం…. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈయన గారు నగరంలోని పలు సెటిల్మెంట్ లనే తన వ్యాపారంగా ఎంచుకున్నాడట ….భూ వివాదాల మొదలు భార్య భర్తలు,కుటుంబ కలహాలు, ఆర్థిక వివాదాలను పరిష్కరించడంలో ఈయన గారు తోపట. ఇటీవల హనుమకొండ ములుగు రోడ్డు లోని కె ఎస్ ఆర్ గార్డెన్ సమీపంలోని ఓ భూమి వివాదాన్ని పరిష్కరిస్తానని మాయమాటలు చెప్పి బాధితుని తరపున మధ్యవర్తిగా ఉంటూ ఐదు లక్షల రూపాయలు నొక్కేశాడట… సమస్య ఎంతకు పరిష్కారం కాకపోగా పైసలు తిరిగి ఇవ్వమన్న భవన నిర్మాణ వ్యాపారినే “భలే ఐటెం గాడిలా ఉన్నావ్” అంటూ బలుపు మాటలు మాట్లాడుతూ ముప్పు తిప్పలు పెడుతున్నాడట… దీంతో సమస్య పరిష్కారం కాక ఇచ్చిన డబ్బులు తిరిగి రాక ఆ భవన నిర్మాణం మధ్యలోనే ఆపేసిన బాధితుడు దిక్కుతోచని స్థితిలో లబోదిబోమంటున్నాడు… ప్రతిరోజు బాధితుల సమస్యలను సెటిల్ చేసే ఇతగాడి బాధితులు కూడా ఎంతోమంది ఉన్నారట.

సెటిల్ మెంట్ల”కట్ల”పాము

ఆయన మధ్యవర్తిత్వం చేస్తే అంతే సంగతులు

నిజంగా “కట్ల”పాము కాటేసినట్లేనట…?

మధ్యవర్తిత్వం పేరుతో లక్షల రూపాయలు, కొన్ని చోట్ల భూమి మాయం….

“కట్ల” పాము పూర్తి కహానీ
త్వరలో……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here