దేశంలో ప్రతిపక్షాల ఐక్యతకు ఒక్కో అడుగు పడుతుంది…. విపక్షాలన్ని కలిసి బీజేపీ పై నిరసన గళాన్ని వినిపిస్తూ మూడో కూటమికి ప్రయత్నాలు సాగిస్తున్నారు….తాజాగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మహా కూటమి ఏర్పాటు కావాలన్నటీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ
బీహార్ సీఎం నితీష్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో కోల్ కతాలో భేటీ ఐయారు… బీహార్ లో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నితీష్ కు సూచించారు …బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలతో కలిసి మహా కూటమి ఏర్పాటు విషయంలో తనకు ఎలాంటి అహం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ప్రజలు వర్సెస్ బీజేపీగా ఉంటాయన్నారు. ‘తాను నితీష్ కుమార్‌కి ఒకే ఒక అభ్యర్థన చేశాను. జయప్రకాష్ నారాయణ ఉద్యమం బీహార్ నుంచే ప్రారంభమైందని, మనం బీహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, తదుపరి ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవచ్చు. అయితే ముందుగా మనమంతా ఐక్యంగా ఉన్నామనే సందేశం ఇవ్వాలి. ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని నేను ముందే చెప్పాను. బీజేపీ జీరో అయిపోవాలని కోరుకుంటున్నాను. మీడియా మద్దతు, అబద్ధాలతో బీజేపీ పెద్ద హీరో అయ్యింది’ అని మమత పేర్కొన్నారు. కాగా, తమ మధ్య చాలా సానుకూల చర్చ జరిగిందన్న నితీష్ కుమార్ రాబోయే ఎన్నికలకు ముందు అన్ని సన్నాహాలు చేయడం గురించి చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుత పాలకులు సొంత ప్రచారం తప్పితే దేశాభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర మహాకూటమి ఏర్పాటు విషయమై మమతను కలిశారు. అనంతరం సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలవడానికి నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ కలిసి లక్నోకు బయలుదేరనున్నారు …..