రెడ్ జోన్ ప్రజలు బయటకు రావద్దు.
లాక్ డౌన్ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించిన చర్యలు.
డిజిపి ఎం. మహేందర్ రెడ్డి, ఎస్పి సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆదేశాలతో రెండో దశ లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు భూపాలపల్లి అదనపు ఎస్పీ వి శ్రీనివాసులు తెలిపారు. కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రనే లక్ష్యంగా అమలు జరుగుతున్న నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయడమే కాకుండా వాటిని ఎవరు ఉల్లంఘించిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలను చేపడుతుందన్నారు. మంగళవారం రెడ్ జోన్ ప్రాంతాలైన మిలీనియం క్వార్టర్స్, సుభాష్ కాలనీ, అలాగే హనుమాన్ టెంపుల్( కాటారం) రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా ప్రాంతాలలో డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ రెడ్ జోన్ లో నివాసముంటున్న ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని ఒకవేళ ఎవరైనా బారికేడ్లు దాటుకొని బయటకు వస్తే కేసులు నమోదు చేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని, ప్రజల ప్రాణాలను రక్షించే క్రమంలో కఠిన చర్యలకు వెనుకాడబోమని అదనపు ఎస్పీ వి. శ్రీనివాసులు స్పష్టం చేశారు. అలాగే నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారు తమ వెంట అడ్రస్ ప్రూఫ్ తెచ్చుకోవాలని, ఉద్యోగులకు త్వరలోనే కొత్త పాసులు జారీ చేస్తామని కేవలం మెడికల్ ఎమర్జెన్సీ కేసులు మాత్రమే మినహాయింపు ఉంటుందని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, సీఐ వాసుదేవరావు, ఎస్ఐలు సాంబమూర్తి, రాకేష్, అనిల్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.