తల్లి బిడ్డది ఒకే తీరు….బిడ్డ ఎస్సై తో సహా ఓ కానిస్టేబుల్ పై చేసుకొని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా….బిడ్డను చూడడానికి పోలీస్ స్టేషన్ వెళ్లి తల్లి అదే పని చేసింది…. తనను అడ్డుకున్న పోలీసులపై చేయి చేసుకుంది….హైదరబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసం వద్ద పోలీసులు తనను ఎక్కడకు వెళ్ళనివ్వడం లేదని వై యస్ షర్మిల ఓ ఎస్సై ,కానిస్టేబుల్ పై చేయిచేసుకోగా పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశారు…ఐయితే తన కూతురు షర్మిలను అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న వై ఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ వెళ్లి షర్మిలను కలిసే ప్రయత్నం చేశారు… అందుకు నిరాకరించిన పోలీసులు వై యస్ విజయమ్మను అడ్డుకున్నారు…దీంతో కోపంతో ఊగిపోయిన విజయమ్మ ఓ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు….తల్లి బిడ్డలిద్దరు తమను అడ్డుకున్న పోలీసులపై చేయిచేసుకోవడం విమర్శలకు తావిస్తోంది…. ఇది సరైంది కాదని ప్రతిపక్షాలు సైతం వారి పనిని తప్పుపడుతున్నాయి…