బీజేపీలోకి పట్నం మహేందర్ రెడ్డి
గులాబీ పార్టీలో మంత్రిగా సీనియర్ నేతగా కొనసాగిన ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం ఐనట్లు తెలుస్తుంది…ఈ నెల 23 న అమిత్ షా సమక్షంలో పట్నం మహేందర్ రెడ్డి బి జే పీ లో చేరనున్నట్లు తెలిసింది….కాగా
పట్నం మహేందర్‌రెడ్డి 1994లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 1999లో వరుసగా రెండవసారి గెలిచి, 2004లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నారాయణరావు చేతిలో ఓటమి పాలయ్యాడు. పట్నం మహేందర్‌రెడ్డి 2009లో మాజీ మంత్రి ఎం.మాణిక్ రావు కుమారుడు ఎం.రమేష్‌పై 13205 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి,రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 31 మే 2019లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు…