వంద యూనిట్ల లోపు విద్యుత్ ఎస్సి ,ఎస్టీ లకు ఉచితం దీన్ని ఉపయోగించుకోండి అంటూ కొంతమంది విద్యుత్ అధికారులు ఎస్సి,ఎస్టీ వాడల్లో ప్రచారం నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తుంటే ఇంకొంతమంది అధికారులు దళిత వాడల్లో కరెంట్ కనెక్షన్లు తొలగిస్తూ కేసులు పెడతాం అంటూ విజిలెన్స్ ద్వారా నోటీసులు ఇప్పిస్తూ బయపెడుతున్నారు… ఇదేంటని నిలదీసిన ఆక్రోశం ఆపుకోలేక గొడవకు దిగిన స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి జైలు పాలు చేస్తున్నారు…..దళిత వాడల్లో అసలు ఒక్క బల్బ్ కూడా సరిగా వాడని గుడిసెల్లో కరెంట్ బాగా వాడుతున్నారని విజిలెన్స్ నోటీసులు ఇచ్చి మీటర్లు కూడా లేని గుడిసెల్లో ఉంటున్న వారికి కరెంట్ బిల్లు చెల్లించాలని ఆదేశాలు జారీచేస్తు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు…ఇదే తరహాలో దామెర మండలంలో విద్యుత్ అధికారులను ప్రశ్నించి కరెంట్ విషయంలో దాడికి దిగారని 13 మంది దళితులపై కేసులు నమోదు చేశారు…
శనివారం రోజున ఎన్ పి డి సి ఎల్ అధికారులు దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ఊరుగొండ లో ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు విద్యుత్ మీటర్లు పెట్టుకోవాలని ఎస్సీ కాలనీ లో అవగాహన కల్పిస్తున్న సమయంలో విద్యుత్ అధికారులపై దాడికి పాల్పడి, దుర్భాషలాడారని గ్రామానికి చెందిన అయిత రాజయ్య ,అక్కెళ్ళ దేవయ్య ,నల్ల ప్రణయ్ , పోలేపాక చేరాలు , జన్ను బిక్షపతి ,పొలేపాక కుమారస్వామి జన్ను కుమార్, నల్ల సుధాకర్ ,పోలెపాక ప్రశాంత్, జన్ను శాంతమ్మ , జన్ను శృతి ,జన్ను సునీత ,నల్ల శాంతమ్మ లపై పరకాల ఏ డి ఈ దేవేందర్ ఫిర్యాదు చేయగా ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది…దింతో మీటర్లు,విజిలెన్స్ నోటీసులు,బకాయిల చెల్లింపు విషయాల్లో దళితులు గందరగోళానికి భయాందోళనకు గురైతున్నారు…దళిత గుడిసెల్లో కరెంట్ బాధలు మొదలు కావడంతో ఉచిత కరెంట్ కు సర్కార్ మంగళం పాడినట్లేనా…? అని పలువురు విమర్శిస్తున్నారు…వంద యూనిట్ల లోపు విద్యుత్ ఉచితం అంటున్న సర్కార్ మీటర్లు లేనివారికి విజిలెన్స్ ద్వారా నోటీసులు ఎందుకు ఇప్పిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.