రహదారి పని పేరుతో ఆ కంపెనీ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది…అనుమతులు గోరంత పనులు మాత్రం కొండంత అన్నట్లు ప్రవర్తిస్తోంది…మొన్నటి వరకు దామెర మండలంలోని ఓ గ్రామ శివారులో అనుమతులు ఉన్నాయన్న పేరుతో అడ్డగోలుగా తవ్వకాలు జరిపి ఆరేపల్లి నుంచి ఒగ్లాపూర్ వరకు రహదారి పనులకు మట్టిని వాడిన ఈ కంపెని ఇప్పుడు ఆత్మకూరు మండలం కటాక్షపురం చెరువులో అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతోంది….ఇక్కడ చెరువులో ని మట్టిని తవ్వి రోడ్డు పనులకు ఉపయోగిస్తున్నారు…
అడ్డగోలు తవ్వకాలు….
ఆత్మకూరు మండలం కటాక్షపురం చెరువులో మట్టి తవ్వకాలు జరుపుతున్న వ్రిద్ది కంపెనీ చెరువును క్వారీ లా మార్చివేసింది… పదుల కొద్దీ అడుగుల లోతులో పెద్ద పెద్ద గుంతలు తీసి చెరువును ఓ పెద్ద బావిలా మార్చి వేస్తున్నారు… వారు ఎన్ని క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకున్నారో సరిగా చెప్పడం లేదు కానీ వారి మట్టి తవ్వకానికి అనుమతులకు ఏమాత్రం పొంతన లేదనే విషయం మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అర్థమైపోతుంది….ఇదిలావుండగా అసలు చెరువులో ఇంత లోతు గుంతలు తీయడానికి వీరికి అసలు అనుమతులు ఎవరు ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు….ప్రధాన రహదారి అది జాతీయ రహదారి పక్కన ఉన్న పురాతనమైన చెరువులో వ్రిద్ది కంపెనీ మట్టి కోసం అడ్డగోలుగా తవ్వకాలు జరపడం విమర్శలకు దారితీస్తోంది….
పట్టింపులేని అధికారులు….
ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువులో వ్రిద్ది కంపెనీ ప్రభుత్వ పని పేరుతో అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతున్న రెవెన్యూ, మైనింగ్,ఇరిగేషన్ శాఖ అధికారులు కళ్ళప్పగించి చూస్తున్నారని పలు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు…వ్రిద్ది కంపెనీ చెరువులో భారీ లోతు గుంతలు చేస్తూ తవ్వకాలు జరుపుతున్న చూసిచూడనట్లు అధికారులు ఉండడం పట్ల వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు….ఇంతలా తవ్వకాలు జరిపి పెద్ద పెద్ద గోతులు చేస్తే చెరువు నిండాకా ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాద్యులని పలువురు ప్రశ్నిస్తున్నారు…రోడ్డు పని పేరుతో వ్రిద్ది కంపెనీ అడ్డగోలుగా తవ్వుతూ అప్పనంగా మొరం తరలించుకుపోయి రోడ్డు వేయడం ఎంతవరకు సబబని అంటున్నారు…సర్కార్ నుంచి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ దక్కించుకుని ఎక్కడి మట్టి అక్కడే నామమాత్రపు అనుమతులతో తవ్వి పైగా కాంట్రాక్టర్ లు సర్కార్ నుంచి కావాల్సింది దండుకుంటున్న అధికారులు మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరించడం ఎందుకో అర్థం కావడం లేదు…ఇకనైనా అధికారులు రంగంలోకి దిగి తవ్వకాలు నిలిపివేస్తార…లేక వ్రిద్ది కంపెనీకే ఇంకా సహకరిస్తార చూడాలి….
మొన్న అక్కడ …నేడు ఇక్కడ
వ్రిద్ది కంపెనీ ఇష్టారాజ్యం…
రేపటి సంచికలో…..