భూ తగాదాలో మహిళలపై దాడి…పట్టించుకోని శాయంపేట పోలీసులు

శాయంపేట మండలం మాందారిపేట గ్రామంలో కొంతమంది యువకులు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు… ఓ భూతగాద విషయంలో మహిళలు అని చూడకుండా విచక్షణ రహితంగా కర్రలతో దాడిచేసి చితకబాదారు….తమకు చెందిన భూమిని అన్యాయంగా రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చి గత కొన్ని సంవత్సరాలుగా ముప్పుతిప్పలు పెడుతూ తాము కాస్తూ చేస్తున్న భూమిని ఎవరికో అమ్మేయడానికి ప్రయత్నం చేస్తుంటే తాము అడ్డుకుంటే బూతులు తిడుతూ దాడికి దిగారని భాదితులు ఆరోపిస్తున్నారు….మాందారిపేట గ్రామానికి చెందిన మస్కె సమ్మయ్య 112/55,112/57 సర్వే నంబర్ గల భూమిలో తాతల కాలం నుంచి కాస్తు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు….నలుగురు కూతుళ్లు,భార్య తో ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు…ఈ భూమిపై కన్నేసిన కొందరు భూమిని అన్యాయంగా ఆక్రమించుకునేందుకు కొమ్ముల మల్లయ్య,రేణుకుంట్ల ఐలయ్య,రేణుకుంట్ల శ్రీకాంత్ లు ప్రయత్నం చేస్తున్నారని తమకు తెలియకుండానే రెవెన్యూ రికార్డ్ లో తమ పేరు మార్చారని భాదితులు ఆరోపించారు….శుక్రవారం ఉదయం తమ భూమిలో హద్దులు పాతడానికి వస్తే అడ్డుకున్నందుకు బూతులు తిడుతూ కర్రలతో తమ పై దాడికి దిగారని బాధిత మహిళలు బోరున విలపించారు…రేణుకుంట్ల ఐలయ్య,కొమ్ముల జీవన్, రేణుకుంట్ల హనుమంతు తమను కర్రలతో కొట్టి గాయపరిచారని అన్నారు…

పోలీస్ స్టేషన్ కు వెళితే బూతులు

తమపై జరిగిన దాడి పై శాయంపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడానికి వెళితే…పిర్యాదు తీసుకోకుండా స్థానిక ఎస్సై ఓ మహిళను అని కూడా చూడకుండా ఇష్టారీతిన బూతులు తిట్టాడని భాదిత మహిళ ఆరోపించింది… ఎక్కడ చెప్పుతారో చెప్పుకోండి…ఎం చేస్తారో చేసుకోండి అంటూ దూషించాడని న్యూస్10 కు తెలిపింది… ఇప్పటి వరకు తమ పిర్యాదు తీసుకోకపోవడం వల్లే తాము పోలీస్ కమిషనర్ కు పిర్యాదు చేయడానికి వచ్చామని కమిషనర్ సార్ తమకు న్యాయం చేయాలని భాదితులు వేడుకుంటున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here