ప్రభుత్వ భూమిపై కాంట్రాక్టర్ కన్ను….?

అతనో పలుకుబడి ఉన్న బడా కాంట్రాక్టర్ ….తన అనుభవాన్నంతా రంగరించి 2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది… ఇంకేముంది సర్కార్ భూమిని దక్కించుకునేందుకు వేసిన తన ప్లాన్ వర్కవుట్ అయింది దర్జాగా చదును చేసి చుట్టూ ప్రహరీ నిర్మించేందుకు సిద్ధమైనట్లు వంగపహాడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపహాడ్ శివారు ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న 10 గుంటల ప్రభుత్వ భూమిని ఎలాగైనా దక్కించుకోవలనుకున్న ఆ బడా కాంట్రాక్టర్ స్థానికంగా ఉండే ఓ వ్యక్తిని వాడుకొని అతనికి మాయమాటలు చెప్పి లేని భూమికి నాలా కన్వర్షన్ చేపించి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రభుత్వ భూమిపై కాంట్రాక్టర్ కన్ను....?- news10.app

నాల చేసింది ఒకటి….

నాలా చేసుకుంది 613 సర్వే నెం.. లోని 10 గుంటలు ..చదును చేసింది 516 లోని ప్రభుత్వ భూమి అని తెలిసింది..హసన్ పర్తి మండలంలోని వంగపహాడ్ శివారులో సర్వే నెం..613 లో రికార్డు ప్రకారం 1.26 గుంటల భూమి ఉంటుంది కానీ పొజిషన్ వచ్చే సరికి 1.10 గుంటలు మాత్రమే ఉంటుంది అంటే ఆర్ ఎస్ ఆర్ కు టీపన్ కు 16 గుంటల భూమి తేడా ఉంటుంది ..కాబట్టి దీన్ని ఆసరాగా చేసుకున్న వీరు భూమిలేకున్న 613 లో 10 గుంటలు నాలా కన్వర్షన్ చేసుకొని దానిని ఆనుకొని ఉన్న సర్వే నెం..516 లోని 10 గుంటల ప్రభుత్వ భూమిని చదును చేసి ఈ ప్రభుత్వ భూమినే సర్వే నెం 613 గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఇటీవలే ఆ భూమిని చదును చేసి చుట్టూ ప్రహరీ నిర్మించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here