ప్రభుత్వ భూములను కాపాడడంలో కొంతమంది రెవెన్యూ అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి… కొద్దిగా పరపతి ఉన్నవారు ఎవరైనా సరే ప్రభుత్వ భూములను కబ్జా చేసిన రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు…ఓ దశలో ప్రభుత్వ భూముల కబ్జా విషయంలో ఫిర్యాదులు చేసిన వారు ఏమాత్రం స్పందించడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి… దింతో కబ్జాకోరులు సైతం “దొరికితే దొంగ…లేదంటే దొర”అన్న చందంగా ఎంచక్కా ప్రభుత్వ భూములు కబ్జా పెట్టి ఆ భూమి తమదే అన్నట్లు ఫోజులు కొడుతున్నారు…సరిగ్గా ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా తన బట్టల వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ఓ బట్టల వ్యాపారి తనను ఎవరు ఏమి అనరు పరిచయాలు దండిగా ఉన్నాయని ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టారట…తాను హన్మకొండ హంటర్ రోడ్ సమీపంలో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ పక్కనే ఉన్న 15 గుంటల ప్రభుత్వ భూమిని పక్కనే ఉన్న తన పట్టా భూమిలో కలిపేసుకొని ఇప్పుడు భారీ నిర్మాణం చేపడుతున్నారు… ఇంత జరుగుతున్నా ప్రభుత్వ భూమి ప్రయివేట్ వ్యక్తి పూర్తిగా కబ్జా పెట్టిన స్థానిక రెవెన్యూ అధికారులు ఇప్పటికి కిమ్మనడం లేదట…ఆ బట్టల వ్యాపారికి ఉన్న పరపతి కారణంగా రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వ భూమి…కబ్జా ఏంటి..?అని ప్రశ్నించి కబ్జా కాకుండా కాపాడడానికి సాహసం చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….
తహశీల్దార్ కు తీరిక లేదా…..?
కాజీపేట మండలం న్యూ శాయంపేట లోని సర్వే నెం 127 లోని 15 గుంటల ప్రభుత్వ భూమి బట్టల వ్యాపారి కబ్జా పెట్టి పెద్ద భవంతి నిర్మిస్తున్న ఖాజీపేట రెవెన్యూ అధికారులు ఇప్పటికి అతన్ని మందలించిన పాపాన పోలేదట…బిల్డింగ్ నిర్మాణం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుండగా ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టిన అతగాడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదట….ఖాజీపేట తహశీల్దార్ కనీసం అటుమొహాన కనీసం కన్నెత్తి చూడలేదట…15 గుంటల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన కాపాడేంత తీరిక ఖాజీపేట తహశీల్దార్ కు లేకుండా పోయిందని తీవ్ర విమర్శలు వచ్చిపడుతున్నాయి… భూమి కబ్జాకు గురైన విషయాన్ని గుర్తించి బాద్యులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని ఆధీనంలోకి తీసుకొని హద్దులు కేటాయించాల్సి న తహశీల్దార్ తనకేం పట్టనట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది… ప్రభుత్వ భూమిని దర్జాగా బట్టల వ్యాపారి కబ్జా చేసిన ఏమాత్రం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండటం ఏంటో అర్థం కావడం లేదని కొందరు అంటున్నారు….తనకు ప్రభుత్వ భూమిని కాపాడే తీరిక లేనట్లు ప్రవర్తిస్తున్న తహశీల్దార్ ఇకనైనా కబ్జా కోరల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడతారా…లేక ఆ బట్టల వ్యాపారి పరపతి చూసి భూమిని వదిలేస్తారా…చూడాలి.