ఎంజీఎం లో పాలన అంతా ఆస్త్యవ్యస్తంగా మారింది… సూపరింటెండెంట్ లు ఎందరు మారిన ఇక్కడ పాలన తీరు ఏమాత్రం మారడం లేదు…. ప్రస్తుతం ఇక్కడ ఇంచార్జ్ సూపరింటెండెంట్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ ఎంజీఎం ను గాడిలో పెడతాడు అనుకుంటే తనవల్ల కూడా ఎం కావడం లేదనే విమర్శలు వచ్చిపడుతున్నాయి…. కాంట్రాక్టర్ మొదలుకొని కొందరు ఉద్యోగుల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సూపరింటెండెంట్ వారిని ఏమాత్రం దారిలో పెట్టడం లేదని ,కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి…. ఉద్యోగులపై సూపరింటెండెంట్ పూర్తిగా పట్టుకోల్పోయారని ఓదశలో కొంతమంది ఉద్యోగులు సూపరింటెండెంట్ మాటను ఏమాత్రం ఖాతరు చేయడంలేదని ఎం జి ఎం లో కొందరు అంటున్నారు…
అంతే కాదు ఎంజీఎం లో ఎంజరిగిన తనకేం పట్టనట్లు వ్యవహరిస్తూ చూసిచూడనట్లు చేస్తున్నారని విమర్శలు సైతం సూపరింటెండెంట్ పై వస్తున్నాయి…. కాగా ఇటీవల కోవిడ్ వార్డ్ లో ఏసీలు వెంటిలేటర్ లు మాయం కాగా అసలు ఇవి ఎవరు ఎత్తుకెళ్లారు ….?అసలు ఇంటి దొంగలు ఎవరు అని గుర్తించడంలో సూపరింటెండెంట్ విఫలం ఐయారని 40 లక్షల రూపాయల విలువైన వస్తువులు పోయాయని స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి చేతులు దులువుకున్నారు తప్ప ఈవిషయం పై ఏమాత్రం శ్రద్ధ కనబర్చలేనట్లుగా కనపడుతుంది….
మరోవైపు ఎంజీఎం లో విలువైన వస్తువులు పోయిన ఇప్పటివరకు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సూపరింటెండెంట్ తీసుకుపోనట్లు విశ్వసనీయ సమాచారం…. జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకు పోవడం లో కూడా సూపరింటెండెంట్ పూర్తిగా విఫలం ఐయారని ప్రచారం జరుగుతోంది… ఇంతజరుగుతున్న సూపరింటెండెంట్ ఏమాత్రం స్పందన లేనట్లు వ్యవహరించడం… ఎంజీఎం లో అనేక సమస్యలు పేరుకుపోయిన వాటి పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయకపోవడంతో అసలు సూపరింటెండెంట్ ఎం చేస్తున్నట్లు అని పలువురు ప్రశ్నిస్తున్నారు… ఇకనైనా సూపరింటెండెంట్ ఎంజీఎం ను గాడిలో పెడతారా లేక తనకేం పట్టనట్లు వ్యవహరిస్తార…? చూడాలి…