రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోందనేది బహిరంగ రహస్యం. కానీ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లాల కార్యాలయాల్లో మాత్రం ఈ అవినీతి తారాస్థాయికి చేరిందని విశ్వసనీయ సమాచారం. రవాణాశాఖ కార్యాలయాల్లో జరిగే అవినీతిని అడ్డుకోవాల్సిన డిప్యూటీ రవాణా శాఖ కమిషనరే అవినీతి సొమ్మును అమాంతం మింగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వద్దకు వచ్చే వాహనదారుల వద్ద నుండి ప్రతి పనికి ఓ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం హన్మకొండ కార్యాలయంలో” ఏవో ” పోస్ట్ ఖాళీగా ఉండడంతో ఈ అధికారి వసూళ్లు రెట్టింపు అయినట్లు కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే ఆయన కు చుక్కల రూపంలో వచ్చే మాముళ్ళతో పాటు అదనంగా “ఏవో” కు వచ్చే రోజువారి ఆదాయాన్ని కూడా ఈ పెద్దసారే దోచుకుంటున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.అంతే కాకుండా ఈ అధికారి పరిధిలో ఉన్న ప్రతి మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు సారు కు ప్రతినెల మామూళ్లు సమర్పించుకుంటారని సమాచారం. ఇలా వాహనదారుల నుండి చుక్కల రూపంలో , మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ల నుండి మామూళ్ల రూపంలో వచ్చే ఆదాయంతో అనేక ఆస్తులు కూడబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అధికారి పై ఐటీ అధికారులు గాని ,ఏసీబీ అధికారులు కానీ దాడి చేస్తే ఊహకందని ఆస్తులు, కోట్ల రూపాయల డబ్బు బయట పడే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ లో ప్రచారం జరుగుతోంది..
ఇంటలిజెన్స్ ఆరా….?
రవాణాశాఖలో ఆ అధికారి అవినీతి పై,డి బి ఏ పాస్ వర్డ్ వ్యవహారంపై న్యూస్10 గత రెండు రోజులు వరుస కథనాలు వెలువరించిన విషయం తెలిసిందే …ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఆ దిశగా దృష్టిసారించి అవినీతి వ్యవహారంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది…. మరోవైపు విజిలెన్స్ అధికారులు సైతం రవాణా శాఖ కార్యాలయంపై ఓ కన్నేసి ఉంచినట్లు తెలిసింది…కాగా ఈ రవాణా శాఖ అధికారి,డి బి ఏ వ్యవహారంపై ఆ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది….రవాణాశాఖలో తనకు రాష్ట్ర స్థాయిలో పరిచయాలు ఉన్నాయి ,అంతా ఉన్నతాధికారులు చూసుకుంటారని డిబిఏ మాటలపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది… అంతేకాదు రవాణాశాఖలోని ఐటి విభాగం పి ఎం ఎస్ లో తనకు పరపతి బాగానే ఉందని దీని సాయంతో తాను ఏదైనా చేయగలనని తన సన్నిహితుల వద్ద డి బి ఏ ఇష్టారీతిన మాట్లాడిన విషయం సైతం రవాణా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది….డీ టీ సీ ,డి బి ఏ ల అవినీతి విషయంలో విచారణ జరిపి రవాణా శాఖ అధికారులు త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది.