ఎంతచేసిన, ఏంచేసిన ఎన్ని తనిఖీలు చేసిన వరంగల్ రవాణా శాఖ తీరు ఏమాత్రం మారేట్లు కనిపించడం లేదు… కంచే చేను మేసిన విధంగా ఇక్కడ పనిచేస్తున్న రవాణా అధికారి తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది…. తాను నిర్వహించే విధులకన్న తనకు రావాల్సిన అడ్డదారి రాబడిపైనే ఎక్కువ మక్కువ పెంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది… విధులకు సైతం హాజరుకాకుండా తరుచుగా డుమ్మాలు కొడుతూ తన ఇష్టం వచ్చిన సమయంలో కార్యాలయానికి వచ్చే ఈ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో పని చేయడంలో కూడా వెనుకాడుతూ ఉంటాడని ఆరోపణలు వినవస్తున్నాయి…. ఇక్కడి రవాణా శాఖ కార్యాలయంలో కార్యనిర్వహణాధికారి .(ఏ ఓ)కూడా లేకుండా విధులు నిర్వహిస్తున్న అని చెప్పుకునే ఈ అధికారి రెండు చేతుల బాగానే వెనుకేస్తున్నట్లు తెలిసింది…రవాణా శాఖ అధికారి వాటా,ఏ ఓ వాటా అంటూ ఈ అధికారి సంపాదనకు ఏమాత్రం అడ్డులేకుండా పోయిందనే విమర్శలు వరంగల్ రవాణా శాఖలో బాగానే వినపడుతున్నాయి….తనకు పై స్థాయిలో బాగానే పరిచయాలు ఉన్నాయని,ఏ సి బి స్థాయిలో తాను పరిచయాలు బాగానే పెంచుకున్నానని తన సహచరులవద్ద చెప్పుకునే ఈ రవాణాశాఖ అధికారి తాను ఎం చేసిన ఎం కాదనే ధీమాతో బాగానే ఉన్నట్లు తెలుస్తుంది…
పాస్ వర్డ్ అమ్మకం….?
పాస్ వర్డ్ అమ్మకం ఇది కొత్తగా వింతగా వినిపిస్తున్న తన కార్యాలయంలో కనీసం కంప్యూటర్ కూడా ముట్టకుండా ఏ పని చేయకుండా,ఇప్పటివరకు రవాణాశాఖ తనకు కేటాయించిన తన పాస్ వర్డ్ ను తన స్వహస్తాలతో ఇప్పటికి టైప్ చేయని ఈ డి టి సి ఏకంగా ఆ పాస్ వర్డ్ ను అమ్మేసినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది…సి ఎం ఎస్ కంపెనీ తరపున పనిచేసే ఓ ప్రయివేటు ఉద్యోగి ఈ రవాణా శాఖ అధికారినుంచి నెలకు ఇంత అని ఓ మొత్తాన్ని ఫిక్స్ చేసుకొని పాస్ వర్డ్ తీసుకున్నట్లు తెలిసింది…వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే ఈ డి బి ఏ ఇప్పుడు ఏకంగా హన్మకొండ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది…ఎలాంటి జంకు లేకుండా డి టి సి గదిలోనే ఓ కుర్చీ వేసుకొని ఈ ప్రయివేట్ ఉద్యోగి విధులు నిర్వహిస్తూ లైసెన్సులు ఇతర పనులకు డి టి సి తరహాలో అప్రూవల్ చేస్తూ షాడో డిటి సి లా వ్యవహరిస్తున్నట్లు న్యూస్10 పరిశీలనలో వెల్లడైంది…విధులకు తరుచుగా డి టి సి ఎగనామం పెట్టిన ఈ డి బి ఏ మాత్రం డి టి సి గదిలోనే తన అనధికారిక విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది..
విలువ పదిహేను లకారాలు….?
ఓ ప్రైవేట్ డి బి ఏ కు రవాణాశాఖ అధికారి తనకు సంబందించిన పాస్ వర్డ్ ను పదిహేను ల కారాలకు అమ్ముకున్నట్లు విశ్వసనీయ సమాచారం…ఎన్ని అప్రూవళ్లు కొట్టిన పర్వాలేదు కానీ నెలకు పదిహేను లక్షలు రవాణా శాఖ అధికారికి చెల్లించేలా వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని రవాణా శాఖ కార్యాలయంలో చర్చ జరుగుతోంది… అందుకే ఆ ప్రయివేటు ఉద్యోగి తానే డి టి సి లా మారి ఆ అధికారినే శాసించే స్థాయికి ఎదిగినట్లు తెలుస్తుంది….కాగా పాస్ వర్డ్ కొనుగోలు చేసిన ప్రయివేట్ వ్యక్తి మాటలు వింటున్న రవాణా శాఖ అధికారి దళిత బంధు వాహనదారులనుంచి సైతం వాహన రిజిస్ట్రేషన్ కోసం ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది… ఇప్పటివరకు హన్మకొండ జిల్లాలో 2100 వాహనాలు మంజూరి కాగా వాటిలో కేవలం 150 వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు సమాచారం…దింతో దళిత బంధు లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది…రిజిస్ట్రేషన్ కావాలంటే వాహనానికి ఐదు వేలు చెల్లించాల్సిందేనని రవాణా శాఖ అధికారి అంటున్నట్లు పైగా ఇది కలెక్టర్ ఆర్డర్ అంటూ లబ్ధిదారులను బెదిరిస్తున్నట్లు తెలియవచ్చింది… ఇలా తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ పాస్ వర్డ్ నే అమ్మకానికి పెట్టిన ఈ అధికారి చుక్కల దందా లో సైతం ఆరితేరినట్లు తెలిసింది తన సంతకం కావాలంటే చుక్క లేకుండా ఏ ఫైల్ ముట్టడని తెలిసింది..విధుల కంటే రాబడి పైనే ఎక్కువ దృష్టి సారించే ఈ అధికారి రెండు చేతుల సంపాదించి భారీగానే వెనుకేసినట్లు తెలిసింది….ఈ విషయంలో ఉన్నతాధికారులు దృష్టి సారించి ఆస్తులపై ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటకు రావడం ఖాయమట…మరి ఈ రవాణాశాఖ ఉప అధికారి విషయంలో ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి….