గ్రేటర్ వరంగల్ పరిధిలో ఎంతచేసిన అక్రమ వెంచర్ ల దందా ఆగేలా కనపడడంలేదు…. అధికారుల నిర్లక్ష్యం, డబ్బు సంపాదనే ద్యేయంగా ఉన్న వెంచర్ యాజమాన్యాల వల్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని బొల్లికుంటలో అక్రమ వెంచర్ ల రాజ్యం నడుస్తోంది.. ఇటీవలే ఈ గ్రామ వాసి అయినటువంటి పోస్టాఫీస్ ఉద్యోగి గ్రామ ఎంట్రెన్స్ లో 4 ఎకరాల్లో అక్రమ వెంచర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఎలాంటి అనుమతులు పొందకుండానే అక్రమంగా వెంచర్ చేసి ప్లాట్ల అమ్మకానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది.
బినామీల ద్వారా వెంచర్ నిర్వహణ
17 వ డివిజన్ బొల్లికుంటలో అక్రమంగా వెంచర్ చేసిన పోస్టాఫీస్ ఉద్యోగి తన పేరు ఎక్కడా రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. 4 ఎకరాల్లో వెంచర్ చేసిన ఈ ఉద్యోగి ప్లాట్లు విక్రయించేందుకు ఓ ఇద్దరిని బినామీలుగా ముందు పెట్టి దందా నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది
అనుమతి లేదు సౌకర్యాలు అసలే లేవు
బొల్లికుంట లో పోస్టాఫీస్ ఉద్యోగి చేసిన వెంచర్ కు మున్సిపల్ నుండి ఎలాంటి అనుమతులు లేవని విశ్వసనీయంగా తెలిసింది. వెంచర్ లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన రోడ్లు, గ్రీనరీ, డ్రైనేజి, విద్యుత్ సౌకర్యం లాంటి వి ఏమి లేకుండానే అక్రమ వెంచర్ చేసి అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వ నిబంధనలను భేఖాతరు చేస్తూ వెంచర్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.