ఎమ్మెల్యే బామ్మర్దా మజాకా…?

వరంగల్ ఉమ్మడి జిల్లాలో తన నియోజకవర్గం అభివృద్ధి లో దూసుకుపోతోందని … మరోసారి తాను ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతానని చెప్పుకొనే ఎమ్మెల్యే అతను… వ్యాపారంలో సైతం దూసుకుపోతూ బాగానే వెనకేసాడని పేరున్న ఎమ్మెల్యే అతను…. అలాంటి ఎమ్మెల్యే కు వరుసకు బావమరిది అయ్యే ఓ గులాబీ నాయకుడి వల్ల తలనొప్పి వచ్చిపడింది… ఆ నియోజకవర్గంలో చూసి రమ్మంటే కాల్చి వచ్చే అనుచరులు ఉన్న ఆ ఎమ్మెల్యే కు అడుగడుగునా వారితో ఇబ్బందులే వస్తున్నాయి… ఇబ్బందులు వస్తున్నాయని సదరు ఎమ్మెల్యే వారిని అదుపులో పెడుతున్నాడా అంటే అదిలేదు….ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న ఓ వ్యక్తి మహిళతో అసభ్యకరంగా మాట్లాడి వార్తల్లోకి ఎక్కితే … మరో అనుచరుడు మీడియా ప్రతినిధి పైబూతు పదజాలంతో అడ్డగోలుగా నోరుపారేసుకున్నాడు… ఇప్పుడు వీరికి తోడు ఎమ్మెల్యే బావమరిది నియోజకవర్గం లో రెచ్చిపోతున్నాడని విమర్శలు వస్తున్నాయి… బావ ఎమ్మెల్యే గా ఉన్న నియోజకవర్గం లోనే కాకుండా పక్క నియోజకవర్గంలో సైతం ఇతగాడు తన ప్రతాపాన్ని చూపెడుతున్నాడట… బావ కళ్ళలో ఆనందం చూడకపోయిన ఈ ఎమ్మెల్యే గారి బావమరిది తన వెంట తిరిగే వారి ఆనందం కోసం బావ పేరు చెప్పి దాడులకు సైతం దిగుతున్నాడట….

ఎమ్మెల్యే బామ్మర్దా మజాకా...?- news10.app

అసలేం జరిగింది….?

భూపాలపల్లి నియోజకవర్గంలోని ఓ మండలం ఆ మండలంలోని ఓ అధికారి ఎమ్మెల్యే బావమరిది కి తెలిసిన వారిని విధులకు హాజరు కావడం లేదని మంద లించాడట… అంతే ఆ నియోజకవర్గం తన బావకు చెందినది కాకున్నా ఎమ్మెల్యే బావమరిది తన అనుచర గణంతో ఆ మండలానికి వెళ్లి అధికారిని ఇష్టంవచ్చినట్లు తిట్టేసాడట… అధికారికి అతగాడికి మాట మాట పెరగడంతో ఇంకా గట్టిగా మందలించాలని అనుకున్న అనువుగాని చోటని ఎమ్మెల్యే బావమరిది అక్కడినుంచి వెళ్లిపోయాడట… అదే కోపంతో ఊగిపోయిన అతగాడు విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న అధికారిని మార్గమధ్యంలో అడ్డగించి తన అనుచరులతో కలిసి చితకబాదాడట… తీవ్రగాయలపాలయిన ఆ అధికారి ఆస్పత్రిపాలయినట్లు తెలిసింది…

పిర్యాదు వెనక్కి….?

ఎమ్మెల్యే బావమరిది దాడిలో గాయలపాలయిన ఆ మండల అధికారి తనపై ఎమ్మెల్యే బావమరిది అతని అనుచరులు కలిసి దాడి చేశారని ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు తెలిసింది… గాయలపాలయిన అధికారి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరుడు ,ఓ గ్రామ సర్పంచ్ అధికారి ఇంటికి వెళ్లి మా ఎమ్మెల్యే బావమరిది పైనే పిర్యాదు చేస్తావా…? అంటూ బెదిరింపులకు దిగడంతో ఆ ఫిర్యాదును కాస్త ఆ అధికారి వెనక్కి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది….

పిర్యాదు చేయడానికి వచ్చారు..

ఆత్మకూరు సిఐ గణేష్

అవును శుక్రవారం రాత్రి ఆ అధికారి పిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చారు…కానీ పిర్యాదు చేయకుండానే ఉదయం వస్తానని వెళ్లి పోయాడు… ఆ తర్వాత మాకు ఆ అధికారి నుంచి ఎలాంటి పిర్యాదు రాలేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here