గ్రేటర్ వరంగల్ పరిధిలో అక్రమ వెంచర్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి …నగర పరిధిలో ముఖ్యంగా 17 వ డివిజన్ బొల్లికుంటలో అక్రమ వెంచర్ ల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నట్లు తెలుస్తోంది… వరంగల్ నగర శివారు బొల్లికుంటలో ఎక్కడ చూసిన ఆ నలుగురు చేసిన వెంచర్ లే కనిపిస్తాయనడంలో సందేహం లేదు . ఈ నలుగురు ఏ వెంచర్ చేసిన ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఎలాంటి వసతులు కల్పించకుండా సంపాదనే ధ్యేయంగా అక్రమంగా వెంచర్ లు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ నలుగురిలో ఒకరేమో ఎమ్మెల్యే తమ్ముడినని చెప్పుకునే వ్యక్తి కాగా ఇంకొకరేమో మున్సిపల్ సివిల్ కాంట్రాక్టర్ మరొకరేమో గులాబీ నేత అనుచరునని చెప్పుకుంటు మున్సిపల్ అధికారులు వెంచర్ లపై చర్యలు తీసుకోకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం
ఎమ్మెల్యే అనుచరులైతే నిబంధనలు వర్తించవా…?
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎక్కడ వెంచర్ చేయాలన్న టిఎస్ బిపాస్ ద్వారా అనుమతులు పొందిన తరువాత మాత్రమే వెంచర్ చేయాల్సి ఉంటుంది నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా గ్రేటర్ పరిధిలో అక్రమంగా వెంచర్ చేస్తే వెంచర్ నిర్వహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.కానీ ఈ నలుగురు బొల్లికుంటలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ లు చేస్తున్న అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నలుగురిలో ఎమ్మెల్యే తమ్మున్ని అని చెప్పుకునే బంగారం షాపు యజమాని,వరంగల్ తూర్పు కు చెందిన ఓ గులాబీ నేత అనుచరుడు , మున్సిపల్ సివిల్ కాంట్రాక్టర్ ఉండడం వల్లే చర్యలకు అధికారులు వెనుకాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం
టౌన్ ప్లానింగ్ అధికారులు ఏంచేస్తున్నట్లు?
వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎక్కడ అక్రమ వెంచర్ లు చేసిన ఆఘమేఘాల మీద స్పందించి వెంచర్ ల పై చర్యలు తీసుకోవడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ నలుగురు చేసే వెంచర్ లపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపణలు బనబసతున్నాయి .నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ లు చేస్తున్న ఈ నలుగురు ఓ ఎమ్మెల్యే పేరు,ఓ గులాబీ నేత ల పేర్లను వాడటం వల్లే టౌన్ ప్లానింగ్ అధికారులు వీరు చేసే వెంచర్ లపై చర్యలు తీసుకోకుండా గమ్మునుంటునట్లు ప్రచారం జరుగుతోంది..