హన్మకొండ జిల్లా విద్యాశాఖలో నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది అధికారులకు కావాల్సింది ఇస్తే నిబంధనల ప్రకారం స్కూల్ ఉన్నా లేకున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తారని ప్రచారం సాగుతోంది వివరాల్లోకెళితే హన్మకొండ లోని ఫాతిమా జంక్షన్ వద్ద ఉన్న రైజింగ్ సన్ స్కూల్ ను ఇటీవలే మెలూహ రైజింగ్ సన్ పాఠశాల గా మార్చినట్లు తెలుస్తోంది అయితే ఈ స్కూల్ విద్యాశాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నప్పటికీ హన్మకొండ జిల్లా డీఈఓ చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ లో పాఠశాల నిర్వహిస్తున్నా డీఈఓ చర్యలు తీసుకోకపోవడం పట్ల పలువురి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మెలూహ రైజింగ్ సన్ స్కూల్ కు జిల్లా విద్యాశాఖ అధికారులకు రహస్య ఒప్పందం కుదరడం వల్లే చర్యలు తీసుకోవట్లేదని విశ్వసనీయ సమాచారం.
కాసులిస్తే నిబంధనలు అవసరం లేదా?
హన్మకొండ జిల్లా పరిధిలో ఎటువంటి విద్యాశాఖ నిబంధనలు పాటించకున్న పాఠశాలలకు అనుమతులు, రెన్యువల్ ఇస్తున్నట్లు తెలిసింది .అధికారులకు కావాల్సింది ముట్టజెప్పితే పాఠశాలలు నిబంధనలు పాటించకున్న చూసిచూడనట్లు ఉంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి
మెలూహ రైజింగ్ సన్ పై డీఈఓ స్పందించేనా?
హన్మకొండ ఫాతిమానగర్ జంక్షన్ వద్ద కమర్షియల్ కాంప్లెక్స్ లో నిబంధనలకు విరుద్ధంగా మెలూహ రైజింగ్ స్కూల్ నిర్వహిస్తున్న విషయం పై న్యూస్-10 గత రెండురోజుల గా కథనాలను వెలువరిస్తున్నా ఈ స్కూల్ పై డీఈఓ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని తెలిసింది. ఇంత బహిరంగంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లో స్కూల్ నిర్వహిస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన డీఈఓ ఆ స్కూల్ యాజమాన్యానికే వత్తాసుపలుకుతున్నట్లు సమాచారం చూద్దాం ఇప్పటికయినా డీఈఓ ఈ విషయం పై స్పందిస్తారో లేదో