ఆ ఇద్దరు సార్లు అంతే….?

వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ఆ ఇద్దరు సార్ల మూలంగా ఉద్యోగులు, పనిపై వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు ఆరోపనలు వస్తున్నాయి…. ఎలాంటి బదిలీ లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే తిష్ట వేసిన ఈ ఇద్దరు అధికారులు తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆర్ డి ఓ ఎలాంటి వివాదాలు లేకుండా తనపని తాను చేసుకుపోతున్న ఇక్కడ పనిచేస్తున్న నాయబ్ తహశీల్దార్ మాత్రం దండుకోవడానికే ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం.

ఆ సారు అతిచనువుతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు…?

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ పెద్దసారు అతిచనువు వల్ల ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అసలే పెద్ద సారు కనుక కొంతమంది ఉద్యోగులు తమ బాధ ఎవరికి ఎలా చెప్పుకోవాలో తెలియక మనోవేదనకు గురైతున్నట్లు ఆ కార్యాలయ ఉద్యోగుల ద్వారా తెలుస్తోంది. అసలే కార్యాలయంలో తాను పెద్దసారు కనుక ఎవరు కూడా కలెక్టర్ కు ఫిర్యాదు చేసే సాహసం చేయట్లేదట. ఈ కార్యాలయంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ అధికారి” నా తర్వాతే ఎవరైనా” అనే స్థాయిలో ప్రవర్తిస్తుంటాడాని సమాచారం… ఎవరిని లెక్క చేయకుండా తన ఇష్టారాజ్యాంగ ప్రవర్తిస్తాడని తెలిసింది.

ఆ ఇద్దరు సార్లు అంతే....?- news10.app

చేతివాటం నాయబ్ తహశీల్దార్….?

ఆర్డీవో కార్యాలయంలో ఎలాంటి బదిలీ లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా మర్రిచెట్టు లా పాతుకుపోయిన నాయబ్ తహశీల్దార్ కార్యాలయంలో ఏ ఫైల్ అయినా తన కనుసన్నల్లోనే జరగాలని పెత్తనం చేలాయిస్తుంటాడట. పైగా సారుకు లకారాలు ముట్టనిదే భూపరిహారం విషయంలో ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడట… ఇలా కార్యాలయంలో తన పెత్తనంతో టెక్స్ టైల్ పార్క్ భూముల పరిహారం విషయంలో లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడినట్లు టెక్స్ టైల్ పార్క్ లో భూమి కోల్పోయిన భాదితులు బహిరంగంగానే ప్రచారం చేస్తున్నారు. ఇటీవలే శాయంపేట గ్రామానికి చెందిన ఓ రైతు భూ పరిహారం విషయంలో సారుకు లకారాలు ముట్టజెప్పాడట. తన పై అధికారితో దోస్తానే ఆయనకు కలిసొస్తుందని కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి

ఎమ్మెల్యే ఆగ్రహానికి గురైన సూపరింటెండెంట్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి కలెక్టర్ కార్యాలయంలో కొనసాగుతున్న ఈ అధికారి నన్ను బదిలీ చేసే సాహసం ఎవరూ చేయలేరని ప్రగల్బాలు పలుకుతుంటాడట. గతంలో ఓ ఎమ్మెల్యే అనుచరుడికి సంబంధించిన భూమి విషయంలో లంచం ఇవ్వకుంటే ముప్పుతిప్పలు పెట్టాడట విసిగిపోయిన ఆ అనుచరుడు విషయం ఎమ్మెల్యే కు చెప్పడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఈ అధికారి పై చేయి కూడా చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. అంత జరిగిన కూడా ఈ అధికారిలో ఇప్పటికి ఎలాంటి మార్పు రాలేదని తన వద్దకు పనులకోసం వచ్చే ప్రజలతో కూడా అమర్యాదగా మాట్లాడటం సారుకు అలవాటేనని కార్యాలయంలో పని చేసే ఉద్యోగుల ద్వారా తెలిసింది. ఇప్పటికయినా ఈ సూపరింటెండెంట్ ను బదిలీ చేస్తారో లేక అదే కుర్చీలో కొనసాగిస్తారో చూద్దాం.

అయిష్టంగానే ఆ కుర్చీలో ఆర్డీవో

వరంగల్ జిల్లా ఆర్డీవో మహేందర్ జి తనకు ఇష్టం లేకున్నా అదే కుర్చీలో కొనసాగుతున్నట్లు తెలిసింది ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ సారు బదిలీ లేక అదే కుర్చీలో అయిష్టంగానే కొనసాగుతున్నట్లు తన సన్నిహితుల వద్ద వెల్లడిస్తున్నారట. 2016 డిసెంబర్ లో ఆర్డీవో గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఈయన 5 సంవత్సరాలు దాటినా ప్రభుత్వం బదిలీలు చేపట్టకపోవడంతో చేసేదేంలేక అదే కుర్చీలో కొనసాగుతున్నారట…. వేరే చోటకు ప్రమోషన్ తో వెళ్లాలని ఈ అధికారికి ఉన్న ఉన్నతాదికారులు మాత్రం ఎలాంటి ప్రమోషన్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉన్నట్లు సమాచారం… దింతో చేసేదేమీ లేక తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇదే జిల్లాకు ఆ ర్డీవో గా తాను అయిష్టంగానే కొనసాగుతున్నట్లు కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు… ఏది ఏమైనా వరంగల్ కలెక్టరేట్ లో పూర్తిగా ఏళ్లతరబడి పాతుకుపోయిన ఉద్యోగులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుపోవడానికి వెనుకాడుతుండడం విమర్శలకు దారి తీస్తుంది.. మరి వీరి విషయంలో జిల్లా కలెక్టర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here