తమ్మీ ….ఎక్స్ ట్రాలు వద్దు…!

తమ్ముడు నీకు ఎక్స్ ట్రాలు బాగా ఐతానయి….. ఆత్మకూరు ప్రజాప్రతినిధులు దొంగలు లంగలు, మాఫియా అని రాసుకో ..నీ రూట్లో నువ్వు పో నా రూట్లో నేను పోత…. నితోని ఎం కాదు ఏమైనా చేసుకో… ఆత్మకూరు మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి దందా నడుపుతూ ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్న ఆత్మకూరు ఎంపిటిసి భర్త బరితెగింపు తనం ఇది… ఎమ్మెల్యే అనుచరుడిని ఎం చేసిన చెల్లుతుందనే గర్వంతో తాను చేస్తున్న అక్రమ దందాను సమర్దించుకుంటు కవరేజ్ కోసం వెళ్లిన న్యూస్10 విలేకరి కి ఫోన్ చేసి బెదిరింపులకు దిగుతున్న వైనం ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే అతనో అధికార పార్టీ ఎంపిటిసి భర్త ప్రజలకు సేవ చేయడం వారికి జవాబుదారీగా ఉండటం అతని విధి… కానీ అతను ఏనాడు ప్రజలకు సేవ చేసింది లేదు… ప్రజలు సమస్యలను తన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించింది లేదు. పైగా ఎమ్మెల్యే కు చాలా సన్నిహితుణ్ణి అంటూ ఫోజులు… అధికారం ఉంది అందులో అధికార పార్టీలో ఉన్నాడు ఇక ఎం చేసినా ఆడిగేవారే లేరు అనుకున్నాడో ఏమో ఆ ప్రభుద్దుడు. తనకున్న పలుకుబడిని ఉపయోగించి అక్రమంగా చెరువులోని మట్టిని తవ్వుతూ జె సి బి వాహనాలను ఉపయోగించి ట్రాక్టర్లు, ట్రక్కుల ద్వారా అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. గుట్ట చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తతంగాన్ని ఆత్మకూరు న్యూస్ 10 ప్రతినిధి సంపత్ తన కెమెరాలో బంధించే ప్రయత్నం చేశాడు. ధీంతో న్యూస్ 10 ప్రతినిదిని కులం పేరుతో దూషిస్తు బండ బూతుల తిట్టి తన మోటార్ సైకిల్ ను లాక్కెళ్లాడు. ఇక ఆత్మకూరు పొలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా అధికార పార్టీకి చెందిన ఎంపి టి సి కావడంతో చర్యలు తీసుకునేందుకు, కేసు నమోదు చేసేందుకు పోలీసులు సైతం వెనకాడుతున్నట్టు సమాచారం.ఇది ఇలా ఉంటే ఈ అక్రమార్కుడు పోలీసులకు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు మామూళ్లు కూడా ఇస్తున్నట్లు బహిరంగంగా చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

తమ్మీ ....ఎక్స్ ట్రాలు వద్దు...!- news10.app

కాంప్రమైజ్ కు రా….

ఆత్మకూర్ ఎంపిటిసి భర్త న్యూస్10 ప్రతినిధిని దూషించడంతో తాను వెళ్లి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి పిటీషిన్ ఇచ్చిన ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా కాంప్రమైజ్ కావాలని పోలీసులు విలేకరి పై ఒత్తిడితెస్తున్నట్లు తెలిసింది.కవరేజ్ కోసం వెళ్లిన న్యూస్10 ప్రతినిధి బైక్ లాక్కెళ్లి రెండు రోజులు గడుస్తున్న ఇదేంటని ఆ ప్రజాప్రతినిధి భర్తను పోలీసులు ప్రశ్నించకపోవడం గమనార్హం పైగా విలేకరి నే కాంప్రమైజ్ కావాలని అడుగుతుండడం విడ్డూరం… ఇప్పటికి కేసు నమోదు చేయకుండా ఆత్మకూర్ పోలీసులు తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here