సిఐ సార్ ….ఈ ప్రశ్నలకు బదులేది……?

ఇదో మహిళ కన్నీటి కథ న్యాయం చేయమని వేడుకుంటే ఆపహాస్యం చేస్తున్న సి ఐ, ఎస్సై ల నిర్లక్ష్యానికి నిలువుటద్దం పడుతున్న తీరు… సహజీవనం పేరుతో మోసం చేసి లక్షల రూపాయలు, బంగారం కాజేసి తిరిగి ఇవ్వమంటే నగ్న ఫోటోలు, వీడియోలు ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ … నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని పేజీల కొద్దీ ఆధారాలు …. సహజీవన మోసగాడు పంపిన నగ్న ఫొటోలను పిర్యాదు తో సహా అందజేసిన ఎలాంటి చర్యలు తీసుకుపోగా ఎఫ్ ఐ ఆర్ తో చేతులు దులిపేసుకొని మోసం చేసిన వారివైపే సానుభూతి చూపుతున్న సుబేదారి సిఐ, ఎస్సై ల తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది…

సిఐ సార్ ....ఈ ప్రశ్నలకు బదులేది......?- news10.app

తమను అనే వారు లేరు పోలీసు అధికారులం మేము అన్న ధీమాతో మహిళకు న్యాయం చేయకపోగా ప్రతిసారి స్టేషన్ కు పిలిచి అవమానిస్తు బాధితురాలిని మానసికంగా వేధిస్తున్న బరితెగింపు తనం ఇది… సి ఐ, ఎస్సై తీరు పట్ల అమహిళా బాధ పడుతుంది… తనకు న్యాయం ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తుంది ఐయిన ఆ సి ఐ, ఎస్సై లది అదే వెటకారం, అదే నిర్లక్ష్యం, అదే పట్టింపులేనిలేనితనం భాదితురాలికి కాకుండా తనకు అన్యాయం చేసినవారి తరుపున వకాల్తా పుచ్చుకున్నట్లు ఆ సిఐ మాటలు, ఆయనకు తోడు ఇప్పుడు సుబేదారి ఎస్సై… మహిళ అన్న గౌరవం , ఈ కేసును నిర్లక్ష్యం చేస్తే ఎటువైపు తిరుగుతుందో … మహిళ గౌరవానికి సంబందించిన విషయం మోసగాడు నగ్న వీడియోలు , ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అవమానానికి గురై మహిళ ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారనే ఇంగితం ఇక్కడి సి ఐ కి ఎస్సైకి లేకుండా పోయినట్లు కనపడుతుంది.

అంతేకాదు ఎఫ్ ఐ ఆర్ చేసిన అరెస్ట్ ఉండదు… ఏంటని అడిగితే పరారీలో ఉన్నారని చెప్తారు కానీ అరెస్ట్ కావాల్సిన వారు మాత్రం పోలీస్ స్టేషన్ ఎదుటే ఉంటారు… పోలీసులు బాధితురాలిని మాట్లాడేది ఉంది రమ్మని పిలుస్తారు… బాధితురాలు స్టేషన్ వెళ్తే అదే స్టేషన్ ముందే తనకు అన్యాయం చేసినవారు కళ్ళముందే ఉంటారు.. కానీ పోలీసులు మాత్రం దొరకడం లేదంటారు. అక్కడే తిరుగుతూ బెదిరింపులకు గురిచేస్తుంటారు… సుబేదారి పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తారు… అరెస్ట్ కావాల్సిన వారు స్టేషన్ ముందు తచ్చా డుతూ ఉన్న ఏమాత్రం పట్టించుకోరు అదిగో తనకు అన్యాయం చేసినవారు ఇక్కడే ఉన్నారని బాధితురాలు చూపించిన పోలీసులు ఏమాత్రం లెక్కచేయరు… విచారణ వివరాలు కావాలనే పేరుతో సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కు రప్పించిన సుబేదారి సిఐ,ఎస్సై పుండు మీద కారం చల్లినట్లు మళ్ళీ పాత పాటే అందుకున్నారట… ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు కదా తనకు అన్యాయం చేసినవారిని అరెస్ట్ చేయమంటే నీ దగ్గర ఉన్న ఆధారాలు సరిపోవు… ఒరిజినల్స్ తీసుకురా అంటూ అక్కడి సిఐ, ఎస్సై సార్లు తాము వేటాకారాన్ని ఇంకొంచెం పెంచి తప్పు చేసినవారికి సపోర్ట్ చేస్తున్న మాట్లాడుతున్నారని బాధితురాలు కన్నీటి పర్యంతం మయ్యింది… తన నగ్న ఫోటోలు, వీడియోల తో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సి ఐ ఎస్సై లకు ఆ ఫోటోలు చూపించిన పదే పదే స్టేషన్ కు రమ్మంటు తప్పుచేసిన వారికి సాయం చేస్తున్నట్లు మాట్లాడుతున్నట్లు బాధితురాలు న్యూస్10 కు తెలిపింది.

సిఐ సార్ ఎందుకంత నిర్లక్ష్యం…..?

తన కేసు విషయంలో పూర్తి నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ తనను హేళన చేసినట్లు మాట్లాడుతూ కాలయాపన చేస్తున్న సిఐ ని తనను మోసం చేసిన వారు ఎదో రకంగా ప్రసన్నం చేసుకోవడం మూలంగానే తన పట్ల చులకన బావంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తోంది… వివరాలు చెప్పడం కోసమంటూ పోలీసులు తనను పోలీస్ స్టేషన్ కు పిలిస్తే తనకంటే ముందే స్టేషన్ ముందు తనను మోసం చేసినవారు ఎలా ఉన్నారని ,తాను వస్తున్నట్లు వారికి ఎవరు చెప్పారని బాధితురాలు ప్రశ్నిస్తుంది… పరారీలో ఉన్నారని చెపుతున్న పోలీసులు మోసగాడు సుబేదారి పోలీస్ స్టేషన్ ముందే ఉన్న అదుపులోకి ఎందుకు తీసుకోలేదని దీనినిబట్టి చూస్తే ఆ సిఐ కి తనను మోసం చేసినవారికి ఎదో లోపాయకారి ఒప్పందం జరిగినట్లే ఉందని అనుమానం వ్యక్తం చేసింది.

నాకేం జరిగిన వారిదే బాధ్యత…

మోసగాడి వల్ల సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖం లో ఉన్న తనకు ఎం జరిగిన సుబేదారి సిఐ, ఎస్సై లే బాధ్యత వహించాలని aబాధితురాలు అంటుంది…తన నగ్న ఫోటోలు,వీడియోలు తనకు తెలియకుండా రహస్యంగా చిత్రీకరించి నెట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తున్న వాడివల్ల తనకు ఏ హాని జరిగిన వారిదే బాధ్యత అని బాధితురాలు చెప్పింది.తన ఫోటోలు , వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న వాడినుంచి ఆ పూటేజ్ మొత్తం డిలీట్ చేయించాలని కోరుతుంది.

వెంబడించిన సహజీవన మోసగాడు…

సోమవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తిరిగి ఇంటికీ వెళ్తున్న తనను రాయల్ ఇన్ ఫీల్డ్ బండి పై వచ్చిన బరుపాటి అనిల్ అతని స్నేహితులు వెంబడించి దాడి చేసే ప్రయత్నం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది… తమ బైక్ వెనకాలే వచ్చి బూతులు తిడుతూ దాడి చేసే ప్రయత్నం చేయగా భయంతో తప్పించుకున్నామని బాధితురాలు తెలిపింది… ఇలా బరితెగించిన వారికి సుబేదారి సి ఐ, ఎస్సై వత్తాసు పలుకుతున్నట్లు మాట్లాడుతున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయకుంటే ఉన్నతాధికారులను ఆశ్రహిస్తానని చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here