గ్రేటర్ లో లెక్కలేనన్ని అక్రమ నిర్మాణాలు….

గ్రేటర్ వరంగల్ నగరంలో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుంది… ఇష్టారాజ్యాల నిర్మాణాల సంఖ్య మరింత పెరిగిపోతుంది…. ఓ వైపు కొంతమంది అధికారుల నిర్లక్ష్యం మరోవైపు కొన్ని నిర్మాణాలకు ప్రజాప్రతినిధుల మద్దతు తో గ్రేటర్ లో అక్రమనిర్మాణాలు పెరిగిపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి… గత కొద్ది రోజులుగా న్యూస్10 అక్రమనిర్మాణాలపై అక్షర సమరం చేస్తుంది… అధికారులు స్పందించి అక్రమనిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరుస కథనాలను ప్రచురించింది… ఈ కథనాలు కొంతమంది టౌన్ ప్లానింగ్ అధికారులకు ఏమాత్రం రుచించలేదు సరికదా మాటలతో బెదిరింపులకు దిగారు ఐయిన తగ్గేదేలే అంటూ నగరంలో ఉన్న అక్రమనిర్మాణాలపై మరోసారి వరస కథనాలు వెలువరిస్తున్నాం…. గ్రేటర్ లో ఉన్న అక్రమనిర్మాణాలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం.. కాగా అధికారుల నిర్లక్ష్య వైఖరి మూలంగా గ్రేటర్ లో లెక్కలేనన్ని అక్రమనిర్మాణాలు అవుతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి… మరోవైపు టౌన్ ప్లానింగ్ అధికారులను అక్రమనిర్మాణాలపై ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదు అంతా టాస్క్ పోర్స్ కమిటీ చూసుకుంటుందని చేతులెత్తుస్తున్నారు….. దీంతో గ్రేటర్ లో లెక్కలేనన్ని నిర్మాణాలు పెరిగిపోయాయి..అనుమతులు ఒకలా తీసుకొని నిర్మాణం ఒకలా చేసిన నిర్మాణాలు అనేకం ఉన్నాయి…

గ్రేటర్ లో లెక్కలేనన్ని అక్రమ నిర్మాణాలు....- news10.app

హంటర్ రోడ్ లో అక్రమంగా అదనపు అంతస్తుల నిర్మాణం

హన్మకొండ హంటర్ రోడ్ లో వైభవంగా ఓ ప్లాజా ను నిర్మించారు.. వరంగల్ పబ్లిక్ స్కూల్ పక్కనే ఇటీవలే నిర్మించిన ఈ ప్లాజా అనుమతి పొందిన విధంగా నిర్మించకుండా అక్రమంగా అదనపు అంతస్తులను నిర్మించినట్లు సమాచారం అంతేకాకుండా పూర్తి సెట్ బ్యాక్ కాకుండానే వారి ఇష్టానుసారంగా నిర్మించుకున్నట్లు ఆరోపణలున్నాయి …. ఈ అక్రమ నిర్మాణం ఇలా ఉందని అధికారులకు తెలిసిన ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు… నిర్మాణం పూర్తి ఐయిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి……

గోపాలపూర్ లో బిల్డర్ ఇష్టారాజ్యం

వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని గోపాలపూర్ లోని కృష్ణా కాలనీలో ఓ బిల్డర్ ఇష్టారాజ్యంగా తన బిల్డింగ్ ను నిర్మిస్తున్నట్లు తెలిసింది కేవలం 200 గజాలు కూడా లేని స్థలంలో 5 అంతస్తుల పేకమేడ లాంటి భవనం నిర్మించడం హాట్ టాపిగ్ గా మారింది.అనుమతి తీసుకున్న విధంగా నిర్మించకుండా తనకు నచ్చిన విధంగా అక్రమంగా అదనపు అంతస్తులను చక చకా నిర్మిస్తున్నాడట… పైగా అంతా అధికారులే చూసుకుంటారు నాకు నో ప్రాబ్లమ్ అనే విధంగా మాట్లాడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం

సెట్ బ్యాక్ లేకుండా దర్జాగా నిర్మాణం

హన్మకొండ చౌరస్తా నుండి హనుమాన్ టెంపుల్ రోడ్ లో ఓ భవనం ఎలాంటి సెట్ బ్యాక్ నిబంధనలు పాటించకుండానే దర్జాగా నిర్మిస్తున్నారు… అసలు ఈ భవనానికి ఎన్ని అంతస్తులకు అనుమతి ఇచ్చారో?వారు ఏ విధంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారో మున్సిపల్ అధికారులకే తెలియాలి

టౌన్ ప్లానింగ్ అధికారులకు తెలియదా?

గ్రేటర్ వరంగల్ పరిధిలో అనుమతులు లేకుండా ఎక్కడ నిర్మాణాలు జరిగితే అక్కడ చిటికెలో వాలిపోయే టౌన్ ప్లానింగ్ అధికారులకు ఈ భవనాలు ఎందుకు కనిపించడంలేదో అర్థంకాని పరిస్థితి.మరి హంటర్ రోడ్ లో ఇష్టారాజ్యంగా నిర్మించిన ఓ ప్లాజా, హన్మకొండ హనుమాన్ టెంపుల్ రోడ్ లో సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్న భవనం, గోపాలపూర్ లో అనుమతి లేకుండానే అదనపు అంతస్తులు నిర్మిస్తున్న భవనం పై అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here