వచ్చే ఎన్నికల కోసం వరంగల్ తూర్పులో అప్పుడే రాజకీయ వేడి మొదలయ్యింది… గులాబీలో ఇప్పుడు వర్గాలవారిగా చీలిపోయి ఎవరి సత్తాను వారు చాటే పనిలో పడ్డారు…అవును ఇప్పుడు తూర్పు గులాబీలో రాజకీయం తుక తుక ఉడుకుతుంది… స్వపక్షీయులే విపక్షీయులుగా మారి ఒక్కరి పై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటుండగా ఇంకొంతమంది నేరుగా విమర్శలు చేస్తూ ఒకరిపై ఒకరు పై చేయి సాదించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు… వీరిలో సీనియర్ నాయకుల నుంచి మొదలుకొని మంత్రి,ఎమ్మెల్యే కూడా ఉన్నారు…ఈ రాజకీయం ఇలా నడుస్తుండగానే వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ నియోజకవర్గంలో తాను పట్టు కోల్పోకుండా తన మార్కు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు… ఈ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా ఉన్నారు అని తాను భావిస్తున్న నాయకులకు తాను ఏదొరకంగా చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడుతోంది… రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వేరే ఎవరు టికెట్ విషయంలో పోటీకి రాకుండా ఒక్కొకరిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం బాగానే జరుగుతుంది… తూర్పులో ఉన్న మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,ఇటీవలే నామినేటెడ్ పదవి దక్కించుకున్న మెట్టు శ్రీనివాస్, ప్రస్తుతం మేయర్ గా కొనసాగుతున్న గుండు సుధారాణి లతో ఎమ్మెల్యే నరేందర్ ఎడమోహం పెడమోహం గానే ఉన్నట్లు తెలుస్తుంది… వరంగల్ తూర్పులో ఇటీవల పదవి పొందిన మెట్టు శ్రీనివాస్ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తే నన్నపనేని వర్గీయులు వీటిని చింపి వేశారని ప్రచారం ఉంది.. వీరి మూలంగా తూర్పులో తన మార్క్ ఎక్కడ పోతుందోనని నన్నపనేని తనకు పోటీ అనుకున్న వారిని దూరం పెడుతున్నారని ఆరోపణలు సైతం వస్తున్నాయి…తనకు నచ్చని వారిని బహిరంగంగానే తక్కువ చేసే ప్రయత్నం చేస్తూనే తన మార్క్ ఎక్కడ పోకుండా చూస్తున్నారని తెలుస్తుంది.
మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే…?
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు మంత్రి ఎర్రబెల్లి కి మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. నియోజకవర్గంలో మంత్రి జోక్యం ఎక్కువవుతుందని ఎమ్మెల్యే నారాజ్ గా ఉన్నట్లు సమాచారం. దింతో మంత్రి తో సైతం ఎమ్మెల్యే ఆంటిముట్టన ట్లే ఉంటున్నట్లు తూర్పు గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది… ఇటీవల వరంగల్ తూర్పులో రైతు దీక్షను నిర్వహించగా ఆ దీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొనగా మంత్రి దీక్ష స్థలిలో ఉన్నంతసేపు ఎమ్మెల్యే నరేందర్ ఆ చాయలకు కూడా రాలేదు… మంత్రి దీక్ష నుంచి వెళ్ళిపోయాక అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే తన ప్రసంగంలో మొత్తం తెలంగాణ ఉద్యమం గూర్చి ప్రస్తావించి మంత్రికి చురకలు అంటించే ప్రయత్నం చేశారు… ఇక మంత్రి తాను ప్రసంగించేటపుడు ఎమ్మెల్యే పేరు రాకుండా ఆయన్ను సంభోదించకుండా చాలా జాగ్రత్త పడ్డారు. మంత్రి లాగే ఎమ్మెల్యే నరేందర్ సైతం తన ప్రసంగంలో మంత్రి పేరు ఎక్కడ రాకుండా చూసుకున్నారు…. దింతో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే వ్యవహారం రోజురోజుకు మరింతగా ముదురుతున్నట్లు కనపడుతుంది.
ఎక్కడ చెడింది….?
అసలు మంత్రి దయాకర్ రావు కు ఎమ్మెల్యే నన్నపనేని కి ఎక్కడ చెడిందనేది ఇప్పుడు వరంగల్ తూర్పు గులాబీలో చర్చకు దారితీసింది.వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడానికి మంత్రి సోదరుడు కారణమని తెలుస్తోంది… గతంలో ఇక్కడ టికెట్ ఆశించి అన్న మాటతో వెనక్కి తగ్గిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు నియోజకవర్గంలో ఇంకా పలు కార్యక్రమాలు నిర్వహించడం ఎమ్మెల్యే కు నచ్చడం లేదని మంత్రి కావాలనే తన సోదరుడిని నియోజకవర్గంలో తిప్పుతున్నారని నన్నపనేని మంత్రి పై అసంతృప్తి తో ఉన్నట్లు తెలిసింది.
పట్టు కోల్పోవద్దు….
వరంగల్ తూర్పులో ఎవరికి చాన్స్ ఇవ్వొద్దు పట్టు కోల్పోవద్దు తనకు వ్యతిరేకంగా ఏ చిన్న కార్యక్రమం జరిగిన సహించొద్దని ఎమ్మెల్యే నరేందర్ పట్టుదలతో ఉన్నట్లు ఆయన కార్యక్రమాలు ఆలోచనలు చూస్తుంటే అర్థం అవుతుంది.తూర్పు గులాబీ కార్యకర్తలతో తరుచు మమేకం అవుతూ వారితో టచ్ లో ఉంటున్న ఎమ్మెల్యే నన్నపనేని ఇంకెవరికి ఇక్కడ గులాబీలో ఛాన్స్ ఇవ్వొద్దని కార్యకర్తలను సిద్ధం చేస్తూ అలాంటి కార్యక్రమాలు ఏవైనా జరిగితే కార్యకర్తలే వాటికి భంగం కలిగించేలా వారిని సిద్ధం చేసినట్లు తూర్పులో అనుకుంటున్నారు.దింతో పాటు గులాబీలో తనకు పోటీగా నాయకులు కొందరు వస్తున్నారని గమనించిన ఎమ్మెల్యే నన్నపనేని నియోజకవర్గ అభివృద్ధిపై సైతం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.. రహదారుల అభివృద్ధి ఇతరత్రా పనులు వేగం పుంజుకునేలా చేసి తన మార్కు చెదరకుండా చూసుకోవాలనే ప్రయత్నాల్లో ఆయన బిజీగా మారినట్లు తెలిసింది. మరోవైపు రానున్న ఎన్నికల్లో తన టికెట్ విషయంలో ఎలాంటి తలనొప్పులు లేకుండా సొంత పార్టీలో పోటీలేకుండా ఇప్పటినుంచే అందరికి చెక్ పెడుతూ అప్పటివరకు మార్గం సుగమం చేసుకోవాలని నన్నపనేని వ్యూహంగా కనపడుతుంది… ఇందులో భాగంగా తూర్పులో తన మార్కు చెక్కు చెదరకుండా ఎంతటి సీనియర్ నాయకుడు తనకు పోటిగా వచ్చిన చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యే నన్నపనేని సిద్ధం ఐయినట్లు ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఋజువుచేస్తున్నాయి…మొత్తానికి నన్నపనేని తన మార్కు తూర్పులో కాపాడుకునేందుకు ధిక్కార స్వరంతో బాగానే ప్రయత్నం చేస్తున్నాడు.