కలెక్టర్ సార్ చర్యలు ఎప్పుడు…?

కొనుగోలు కేంద్రం లేదు… ధాన్యం కొనుగోలు చేసింది లేదు… కాని అక్షరాల రూపాయలు కోటి మింగేశారు… ఈ అక్రమ దందాలో అధికారి నుంచి మొదలు పెడితే మిల్లు యాజమాన్యం వరకు పాత్ర ఉన్నట్లు శాఖ పరమైన విచారణ, విజిలెన్స్ విచారణలోను తేలింది… అధికారులు సైతం స్కామ్ నిజమేనని తేల్చి చర్యలకు సిపార్స్ చేస్తూ కలెక్టర్ కు నివేదిక సమర్పించారు… ఈ స్కామ్ ను వెలికితీసిన న్యూస్10 ఎప్పటికప్పుడు కథనాలు వెలువరించింది… స్కామ్ లో పాలుపంచుకున్న అధికారుల తీరును, మిల్లు యాజమాన్యం అవినీతిని ఎండగట్టింది… ఇదంతాబాగానే ఉన్నా ఇంతగా స్కామ్ జరిగి కోటి రూపాయల సర్కార్ ధనం అదికారులు ,మిల్లర్ కలిసి మింగారని విచారణలో తేలిన ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ మాత్రం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు… దింతో అవినీతిలో పాలుపంచుకున్న అధికారులు తమకు ఏంకాదని ధీమావ్యక్తం చేస్తున్నారు…. అవినీతి జరిగినట్లు అన్ని విచారణలల్లో తేలిన కలెక్టర్ ఎందుకు చర్యలు తీసుకోవడానికి ఆలస్యం చేస్తున్నారో అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది… విచారణ నివేదిక ఇచ్చాం ఇక కలెక్టర్ నిర్ణయమే తదుపరి అని ఇతర అదికారులు చెప్తుండగా కలెక్టర్ మాత్రం ఇంకా సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో అసలు ఏజరుగుతుందోతెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

కలెక్టర్ సార్ చర్యలు ఎప్పుడు...?- news10.app

వజ్రకవచ మిల్లు యాజమాన్యం నుండి డబ్బు రికవరీ చేస్తారా?

హన్మకొండ జిల్లా పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి కొనుగోళ్లు జరగకున్నా 40 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు జరిపినట్లు, కొనుగోలు చేసిన వడ్లను వజ్రకవచ మిల్లుకు పంపినట్లు అధికారులు మిల్లు యజమాని తో కుమ్మక్కై దొంగ రికార్డులు నమోదు చేసారు. ఈ 40 మంది అకౌంట్ లలో సుమారు కోటి రూపాయల వరకు నగదును సివిల్ సప్లై మేనేజర్ జమచేశారు… అసలు విషయం ఏమిటంటే ఈ 40 అకౌంట్ లలో పడిన డబ్బులను వజ్రకవచ మిల్లు యజమాని తన అకౌంట్ కి తన కుటుంబ సభ్యుల అకౌంట్ లోకి మళ్లించుకున్నట్లు అదనపు కలెక్టర్ నియమించిన విచారణ కమిటీ తేల్చిచెప్పినట్లు తెలిసింది.. నివేదికను సైతం అదనపు కలెక్టర్ సంధ్యారాణికి అందజేశారు.విచారణ నివేదికను చర్యల నిమిత్తం కలెక్టర్ పంపినట్లు ఆమె న్యూస్-10 కొన్నిరోజుల క్రితమే స్పష్టం చేశారు.కానీ నెలలు గడుస్తున్నా ఈ స్కామ్ పై కలెక్టర్ చర్యలు మాత్రం తీసుకోవడం లేదు ఇప్పటికయినా కలెక్టర్ దృష్టి సారించి డబ్బును రికవరీ చేసి భాద్యులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు

సివిల్ సప్లై మేనేజర్ కు తెలియకుండానే జరిగిందా?

రైతుల వద్ద నుండి ధాన్యం సేకరించడంలో సివిల్ సప్లై అధికారుల పాత్ర కీలకం… అలాంటిది హన్మకొండ జిల్లా పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రం పేర కోటి రూపాయల స్కామ్ జిల్లా మేనేజర్ కు తెలియకుండానే జరిగిందా? కొనుగోళ్లే జరగనప్పుడు ఆ సెంటర్ కు 9 లక్షల విలువైన 13వేల గన్నీ బ్యాగులు పంపినట్లు జిల్లా మేనేజర్ ఎలా నమోదు చేశార….?, సెంటర్ నుండి ధాన్యాన్ని మిల్లుకు తరలించడానికి కాంట్రాక్టర్ కు 1,63,000 వేల రూపాయలు ఎందుకు చెల్లించారో… మేనేజర్ కృష్ణవేణి కే తెలియాలి ఈ తతంగాన్ని గమనిస్తే మేనేజర్ కు తెలిసే ఈ స్కామ్ జరిగిందని అర్ధం అవుతోంది.

కలెక్టర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?

హన్మకొండ జిల్లా పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రం పేర కోటి రూపాయలకు పైగా అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. దీనిపై న్యూస్-10 గత కొన్ని నెలలుగా అక్షర సమరం చేస్తూనే ఉంది… ఈ కథనాలపై స్పందించిన అదనపు కలెక్టర్ సంధ్యారాణి ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని నియమించారు. విచారణ జరిపిన అధికారులు నివేదికను అదనపు కలెక్టర్ కు అందజేశారు… తదుపరి చర్యల నిమిత్తం ఆ ఫైల్ ను కలెక్టర్ కు పంపినట్లు గత 3 నెలల క్రితమే అదనపు కలెక్టర్ న్యూస్-10 కు తెలిపారు… కానీ ఇప్పటివరకు హన్మకొండ జిల్లా కలెక్టర్ ఈ స్కామ్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోందని ఆ శాఖ ఉద్యోగులే అంటున్నారు. ఇప్పటికయినా ఈ స్కామ్ పై కలెక్టర్ చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here