గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి ఇటీవలి కాలంలో గ్రేటర్ వరంగల్ గడ్డ అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నగరంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు భవన యజమానులు ఇచ్చే తాయిలాలకు అలవాటు పడినట్లు జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు అక్రమ నిర్మాణాల పై న్యూస్-10 వరుస కథనాలను ప్రచురిస్తున్న విషయం తెలిసిందే అయినా కూడా అధికారుల్లో ఎలాంటి మార్పు రావట్లేదు అంటే నగరంలో అక్రమ నిర్మాణాలు సిటీ ప్లానర్ కు తెలిసే జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కనుక మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకుని ఈ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాలని సామాన్యులు కోరుకుంటున్నారు.
సిటీ ప్లానర్ మౌనం ఎందుకు…?
హన్మకొండ లోని గ్రీన్ పార్క్ హోటల్ పక్కనే అరకొర అనుమతులతో జీ ప్లస్ 1 కు అనుమతి పొందిన ఓ బిల్డర్ తన ఇష్టారాజ్యంగా జీ ప్లస్3 భవనాన్ని సెట్ బ్యాక్ లేకుండా నిర్మిస్తున్నాడు ఈ విషయంలో ఆ భవన యజమానికి నోటీసులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతకు ఇష్టపడడం లేదంటే, ఆ యజమాని వద్ద ఎంత పుచ్చుకుని గమ్మునున్నారోనని ఆరోపణలు బాగానే వస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణం పై సిటీప్లానర్ నోరు మెదపడం లేదంటే అసలు సిటీ ప్లానర్ ఏ స్థాయిలో బిల్డింగ్ యజమానులతో ఏ స్థాయిలో అవగాహన కలిగి ఉన్నారని కొంతమంది విమర్శల వర్షం కురిపిస్తున్నారు
కమిషనర్ రంగంలోకి దిగేనా?
హన్మకొండ నగరం నడిబొడ్డున అదాలత్ దగ్గర గ్రీన్ పార్క్ హోటల్ పక్కనే అక్రమ నిర్మాణ విషయం న్యూస్10 వెలుగులోకి తీసుకురాగానే నోటీసులు ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఆ నిర్మాణం పై చర్యలకు వెనకాడుతున్నట్లు కనపడుతుంది.నోటీసులు అందించి 48 గంటల గడువు విధించిన అధికారులు 48 గంటలు గడిచి వారం పైగా రోజులు గడిచిన చర్యలకు ససేమిరా ముందుకు కదలడం లేదు.. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం, బిల్డింగ్ యజమానులతో ఓ అవగాహన కుదుర్చుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికయినా మున్సిపల్ కమిషనర్ రంగంలోకి దిగి అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు… త్రినగరం అంతటా భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాలు వెలుస్తుండడంతో మున్సిపల్ కమిషనర్ ఓ నజర్ వేయాలని కోరుతున్నారు.మరి ఈ విషయంలో కమిషనర్ ఎలా స్పందిస్తారో, చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే