ఆస్తుల సంపాదనలో ఆరితేరిన ఆ సివిల్ సప్లై అధికారి గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అడ్డు అదుపు లేకుండా తన ఆస్తులను పెంచుకుంటూ పోయినట్లు తెలిసింది. అసలే పౌర సరఫరాల శాఖ దండిగా ఆదాయం ఉన్న శాఖ కావడంతో మంచి తరుణం మించిన దొరకదు అన్నట్లు ఆ అధికారి రెండు చేతుల సంపాదించి ఆస్తులు బాగానే కూడబెట్టినట్లు ఆయన పనిచేస్తున్న శాఖలోనే జోరుగా ప్రచారం సాగుతోంది.
నిర్మాణంలో ఖరిదైనా భవంతి…
హన్మకొండలోని హంటర్ రోడ్ లో ఖరీదైన ఓ భవంతిని ఆ అధికారి అన్ని హంగులతో నిర్మిస్తున్నాడు.దీని నిర్మాణానికి సుమారు ఓ మూడు కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ భవనానికి లిఫ్ట్ తో సహా సకల సౌకర్యాలు ఉంటాయని ఈ భవనం కోసం పనిచేస్తున్న వాళ్ళు చెపుతున్నారు. ఈ బిల్డింగ్ ఆ సారుదేనని వారు నిర్థారించారు. కాగా ఈ అధికారి తాను సంపాదించిన ఆస్తులను తన మామ పేరున ఉంచినట్లు తెలిసింది. అంటే మామానే తన బినామిగా ఈ అధికారి మార్చినట్లు ప్రచారం సాగుతోంది. తాను పనిచేస్తున్న శాఖలో అందినకాడికి దండుకుంటాడని ఆరోపణలు ఉన్న ఈ అధికారి ఎవరు తనపై ఎన్ని ఫిర్యాదులు చేసిన ఎం కాదని ధీమా వ్యక్తం చేస్తున్నాడట…ఇదిలాఉంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో సివిల్ సప్లై శాఖలో తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు కొందరూ అధికారులు అక్రమ ఆస్తుల సంపాదనలో పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ శాఖలో అందరు అందరే అన్నట్లు ఉన్నారని విమర్శలు వస్తున్నాయి.ఈ అధికారులు ఎం చేసిన ఉన్నతాధికారులు కనీసం ఎం చర్యలు తీసుకోకపోవడం వల్ల వీరి అవినీతి రోజురోజుకు పెచ్చుమీరి పోతున్నట్లు సమాచారం.