అతడు నోరుతెరిస్తే అబద్దాలు… అమ్మాయిలను లొంగదీసుకోవడానికి ఎలాంటి అబద్దాలయిన ఆడుతాడట. మోసం చేయడం అలవాటుగా మారిన ఇతగాడిపై ఇటీవల నర్సంపేట డివిజన్ లోని ఓ పోలీస్ స్టేషన్లో ఓ యువతి పిర్యాదు కూడా చేసిందట. సహజీవనం పేరుతో ఓ మహిళను మోసం చేసి 75 లక్షల నగదు, 20 తులాల బంగారం కాజేసిన ఈ మోసగాడు అబద్దాల పుట్ట అనితెలిసింది. తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వమంటే న్యూడ్ వీడియో లు ఉన్నాయి నెట్ లో పెడతానంటూ ఆ మహిళను బెదిరిస్తూ సాంపిల్ ఫోటోలు ఇవిగో అంటూ వాట్సాప్ చేసిన ఈ ప్రబుద్ధుడు ఇలా ఇంకొంతమంది మహిళల వీడియో లతో బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్నట్లు సమాచారం.
మాజీమంత్రి కొడుకును….
తాను మాజిమంత్రి కొడుకునని ప్రస్తుతం తన తల్లి ఆంద్రప్రదేశ్ లోని ఓ నియోజకవర్గానికి ఎంపీ అని అబద్దాలు చెప్పిన సహజీవన మోసగాడు తన తల్లి ఎంపీ అంటూ ఓ నకిలీ విజిటింగ్ కార్డ్ తయారు చేసి అది అందరికీ ఇస్తూ. మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. నియజకవర్గం పేరు లేకుండా కేవలం ఢిల్లీ అడ్రస్ తో విజిటింగ్ కార్డ్ ముద్రించి నమ్మించడం ఇతగాడు అలవాటుగా మారింది. ఇదే తరహాలో భాదిత మహిళను సైతం అతగాడు నమ్మించి మోసం చేసినట్లు తెలిసింది. ఒంటరి మహిళను లొంగదీసుకునేందుకు వేసిన పథకం లో భాగమే ఈ విజిటింగ్ కార్డు డ్రామా గా ఋజువవుతుంది.
పడకగదిలో రహస్య కెమెరాలు….
సహజీవనం చేస్తున్న మహిళను డబ్బులు అడిగితే బెదిరించడం కోసం ముందుగానే ఓ ప్లాన్ వేసి పడకగదిలో రహస్య కెమెరాలు అమర్చినట్లు భాదిత మహిళ తెలిపింది. తన గదిలో రహస్యంగా తీసిన వీడియోలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు భాదిత మహిళ వెల్లడించింది.
పోలీసులకు పిర్యాదు..
తనకు జరుగుతున్న అన్యాయంపై భాదిత. మహిళా హన్మకొండ పోలీసులకు పిర్యాదు చేయగా అక్కడ తన భాద పట్టించుకున్నవారు ఎవరు లేరని బాధిత మహిళ వాపోయింది… ఫిర్యాదును ఈజీగా తీసుకున్న పోలీసులు రేపు మాపు అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకున్నారని. రెండు రోజుల తర్వాత స్టేషన్ కు పిలిచి అక్కడి ఎస్సై ఇష్టారీతిన తనను మైనర్ ఐయిన తన కొడుకును ఇష్టారీతిన తిట్టాడని భాదిత. మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నగ్న ఫోటోలు, బెదిరింపు చాటింగ్ లు, డబ్బులు కాజేసిన వాటికి సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్న అవేమి చూడకుండా ఆ ఎస్సై… డబ్బున్న వాడని మీరే అతన్ని బెదిరిస్తున్నారని బూతులు మాట్లాడడం తనకు బాధను కలిగించిందని బాధితురాలు తెలిపింది… సిఐ సైతం తమ దగ్గర ఉన్న ఆధారాలు ఏవి పరిశీలించకుండానే పిలిచి మాట్లాడుదాం అంటూ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నట్లు బాధితురాలు న్యూస్10 కు తెలిపింది.
కేసు నమోదు చేస్తాం… హన్మకొండ సిఐ వేణుమాధవ్
సహజీవనం పేరుతో మోసం చేసి లక్షలు కాజేసిన అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హన్మకొండ సిఐ వేణుమాధవ్ న్యూస్10 కు తెలిపారు….. మహిళలకు అన్యాయం చేస్తే అది ఎంతటివారైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు… బాధిత మహిళనుంచి మరిన్ని వివరాలు సేకరించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన న్యాయం చేస్తామని ఆయన చెప్పారు.