పాస్ బుక్ ల పేరుతో వెంకన్న బురిడీ….?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి కొంతమంది మూలంగా విమర్శల పాలవుతుంది… రైతులకు మేలు జరుగుతుందని సర్కార్ ధరణి ని ప్రవేశపెడితే ఆధరణిలో పనిచేసే ఉద్యోగులు తమ చేతివాటంతో భూసమస్యల పరిష్కారం కోసం వచ్చిన రైతులను పీడించి డబ్బులు దండుకుంటూ నానా కష్టాలు పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ ఆర్డీఓ కార్యాలయంలో గతంలో ధరణి లో ఆపరేటర్ గా పనిచేసి ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో కంప్యూటర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి ధరణిలో ఏ పని కావాలన్న కాసులు ముట్టజెప్పితేనే పని చేసిపెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… భూసమస్యల పరిష్కారంలో రైతులు ఇతన్ని సంప్రదిస్తే చాలు ఈపని చేస్తే ఇంతా అని ఓ రేటును నిర్ణయించి పని చేసిపెడుతానని నమ్మబలికి రైతుల వద్ద డబ్బులు దండుకొని నానా తిప్పలు పెడుతున్నట్లు తెలిసింది. ఏ పని చెప్పిన ఇది కాదు అనే మాట ఇతగాడి నోటివెంట రాదట ఎంతటి జఠిలమైన పని ఐయిన ఇట్టే చేసి పెడతానని తన సన్నిహితుల వద్ద ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి చెపుతుంటాడట… అంతే కాదు ప్రస్తుతం నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఇతగాడికి కొలువు లేకున్నా డివిజన్ లోని తహశీల్దార్ లు సైతం ధరణిలో పని కావాలంటే ఇతగాడిని సంప్రదించాల్సిందేనని బాగానే ప్రచారం జరుగుతోంది.. పనిచేయాలని వారు కోరిన ఇతను ఆ అధికారులను సైతం ముప్పుతిప్పలు పెట్టి రేపు మాపు అంటూ తనకు తోచినపుడు పని చేసిపెడతాడట.. ఇతనిపై గతంలో కొంతమంది ఫిర్యాదులు చేసిన అధికారులు ఎవరు చర్యలు తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఇంకా నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగిది ఆడింది ఆట పాడింది పాట గా కొనసాగుతుందట దింతో తన ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాస్ బుక్ ల పేరుతో వెంకన్న బురిడీ....?- news10.app

బాగానే వెనుకేశాడు……?

గత 12 సంవత్సరాలుగా రెవెన్యూలో పనిచేస్తున్న అంటూ గొప్పలు చెప్పుకునే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి పది వేల వేతనంతో ఉద్యోగిగా చేరి ప్రస్తుతం మూడు పదుల జీతం తీసుకుంటున్న అని ప్రచారం చేసుకునే ఇతను నర్సంపేట డివిజన్ లో భారీగానే ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.పెట్రోల్ బంక్, టిప్పర్ లు,ఇటాచి వాహనాలు ఇలాబాగానే కూడబెట్టినట్లు తెలుస్తుంది. తనపేరుపై ఆస్తులు ఉంటే ఎప్పుడైనా ప్రమాదమే అని గ్రహించిన ఇతను ఇటీవలే తన సమీప బంధువు పేరుపై అన్ని బదలాయించినట్లు సమాచారం… ఇక్కడితో ఆగకుండా నర్సంపేట డివిజన్ లోని ఓ ప్రాంతంలో ఇతగాడు ఓ క్వారీ సైతం నిర్వహిస్తున్నట్లు తెలియవచ్చింది.

డివిజన్ లో మట్టివ్యాపారం

వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇతను నర్సంపేట డివిజన్ లో మట్టిదందా బాగానే చేస్తున్నట్లు తెలిసింది.నర్సంపేట ఆర్డీవో కార్యాలయంలో పనిచేసేటపుడు మొదలుపెట్టిన ఈ మట్టిదందా ఇప్పటికి ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నట్లు సమాచారం… మట్టిదందా ను ఎవరైనా అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వరంగల్ జిల్లా కలెక్టరేట్ పెరిచెప్పి బయపెట్టించే ప్రయత్నం చేస్తాడట.గతంలో ఆర్డీవో కార్యాలయంలో పనిచేసేటపుడు ఆర్డీవో పేరుచెప్పి అధికారులను బెదిరించే ఇతని ఇప్పుడు వరంగల్ కలెక్టరేట్ పేరు బాగానే వాడుతున్నాడట. ఇదిలాఉంటే ధరణితో ఇబ్బందులు ఎదుర్కొంటు పనికాక ఇతగాడిని ఆశ్రయించి పనులు చేసిపెట్టాలని డబ్బులు సమర్పించిన కొంతమంది రైతులు అటు పనిగాక ఇటు డబ్బులు రాక చెప్పులు అరిగేలా తిరుగుతున్నారట. ఐయిన ఈ కంప్యూటర్ సారు ఎవరికి ఇప్పటికి నయా పైసా చెల్లించలేదని తెలియవచ్చింది. అంతేకాదు తన ఆవసరాలకోసం ఓ వ్యక్తి వద్ద లక్షలరుపాయలు అప్పుగా తీసుకొని తిరిగిఇవ్వకుండా తీవ్రఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసింది.అప్పుగా డబ్బులు తీసుకొని ఓ రెండు బ్లాంక్ చెక్ లు,ప్రామిసరి నోట్ రాసిఇచ్చి డబ్బులు తిరిగి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు విశ్వసనీయసమాచారం. కాగ ఇతగాడికి ఏదైనా ఇబ్బంది ఎదురయితే నర్సంపేట డివిజన్ లో పనిచేస్తున్న ఓ పోలీస్ అధికారి పేరుచెప్పి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది.బాధితులు ఎవరైనా ఇక్కడి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేస్తే ఆ పోలీస్ అధికారి మాట్లాడి పంపిస్తున్నాడు తప్ప ఏమాత్రం న్యాయం చేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆ పోలీస్ అధికారి సైతం ఆ కంప్యూటర్ అసిస్టెంట్ కే సహకరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో నర్సంపేట డివిజన్ కేంద్రంలో ఇతనిపై పిర్యాదు చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదని తెలియవచ్చింది. ఇకనైనా ఈ కంప్యూటర్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకోవాలని భాదితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here