సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో రియల్టర్ల ఇష్టారాజ్యం కొనసాగుతుంది.. ఎలాంటి అనుమతులు లేకుండా పది ఎకరాల్లో నిభందనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఎం చేసిన అధికారులు తమనేం చేయలేరని ధీమావ్యక్తం చేస్తున్నారట. ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ లు ఏర్పాటు చేయడం రియల్ దందా కొనసాగించడం తమకు “మాములే”నని వారు అంటున్నట్లు తెలిసింది.
చర్యలు శూన్యం…
హుస్నాబాద్ మండలం పోతారం లో ఎలాంటి అనుమతులు లేకుండా పది ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తుంది. ఇంతటి బహిరంగంగానే వెంచర్ వేసి పాట్లు అమ్మకాలు కొనసాగుతున్న అధికారుల చర్యలు మాత్రం శూన్యంగా క కనీపిస్తున్నాయి… వెంచర్ ను తొలగించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి.
డి టి సి పి అధికారులు ఎం చేస్తున్నట్లు…..?
హుస్నాబాద్ మండలం పోతారం లో పది ఎకరాల్లో పెద్దఎత్తున వెంచర్ నిర్వహిస్తున్న సిద్దిపేట జిల్లా డి టి సి పి అధికారులు ఏంచేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు… డి టి సి పి అప్రూవల్ కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ కొనసాగిస్తున్న అధికారులు తమకేంపట్టనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. వెంచర్ నిర్వాహకులు ఇచ్చే ముడుపులకు అలవాటుపడ్డ అధికారులు అక్రమ వెంచర్ పై చర్యలకు వెనుకాడుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా డి టి సి పి అధికారులు అక్రమ వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.