హన్మకొండ జిల్లా పలివేల్పుల గ్రామంలో ధాన్యం కొనుగోలు పేరుతో అసలు కొనుగోలు కేంద్రమే లేకున్నా కొనుగోలు చేసినట్లు కాగితాలపై లెక్కలు చూపి కోటిరూపాయలకు పైగా హన్మకొండ జిల్లా పొరసరఫరాల శాఖ లో ఉన్న ఓ అధికారి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి, మిల్లు యజమాని కలిసి నొక్కేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అసలు కొనుగోళ్లు లేకున్నా ఉన్నట్లు సృష్టించి ఆరోపణలు ఎదుర్కొన్నారు… స్థానికులు,రైతులు చెప్పినదాని ప్రకారం అది నిజమేనని తేలింది.ఈ విషయం బయటకు రావడంతో స్కామ్ పై విజిలెన్స్ సైతం దర్యాప్తు జరిపి డబ్బులు దండుకున్నట్లు తేల్చింది.
అధికారుల విచారణలో సైతం డబ్బులు నొక్కేసినట్లు తేలగా ఇదే విషయం తెలుపుతూ అధికారులు హన్మకొండ జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించినట్లు తెలిసింది.విచారణ నివేదిక సమర్పించారు స్కామ్ చేసిన వారిపై రేపో మాపో చర్యలు ఉంటాయని అందరూ భావించారు కానీ నెలలు గడుస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు లేకుండా పోయాయి… లక్షల రూపాయల సర్కార్ సొమ్మును లక్షణంగా దోచుకున్న సివిల్ సప్లై అధికారులు,ఉద్యోగులు మాత్రం దర్జాగా ఉద్యోగానికి వస్తూ పోతూ ఉన్నారు… ఎన్ని డబ్బులు నొక్కిన మాపై చర్యలు ఉండవని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారట.అధికారుల నివేదిక, విజిలెన్స్ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ వీరిపై చర్యలు తీసుకోవాల్సి ఉండగా నివేదిక వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా… ధాన్యం కొనుగోళ్లలో అవినీతి నిజమేనని తేలిన కలెక్టర్ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుండడంతో ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా… అనే అనుమానం పౌరసరఫరాల శాఖ ఉద్యోగుల్లో కలుగుతుందట. కలెక్టర్ సార్ ఆ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారా… అని ఉద్యోగులే చర్చించుకుంతున్నట్లు తెలుస్తుంది.కలెక్టర్ సార్ ఆ ఉద్యోగులపై చర్యలు ఎప్పుడు అని కొంతమంది రైతులు సైతం ప్రశ్నిస్తున్నారు.మరి ఈ విషయంలో కలెక్టర్ సార్ ఎలా స్పందిస్తారో. అసలు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి