క్యాంపు కార్యాలయంలో అవినీతి తిష్ట…..?

నేనుఇక్కడినుండి కదిలేదే లే ..ఈ కార్యాలయాన్ని వదిలేదేలే.. ఏ అధికారి అయినా నేను చెప్పింది వినాల్సిందే నా అనుమతి లేనిదే ఏ ఫైలు ముందుకు కదలదు నా దర్శనం జరగకుండా సారును కలవడం కుదరదు… అనే రీతిలో వరంగల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సూపరిండెంట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడట..

క్యాంపు కార్యాలయంలో అవినీతి తిష్ట.....?- news10.app

ఆరేళ్లుగా ఒకే చోట….

ఆరేళ్లుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉద్యోగం వెలగబెడుతున్న ఇతగాడు ప్రతిపనికో రేటు ఫిక్స్ చేసి అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఆరు సంవత్సరాలుగా అదే కార్యాలయంలో తిష్ట వేసి చక్రం తిప్పుతున్నాడట . పని నిమిత్తం కార్యాలయానికి ఎవరు వచ్చిన పని చేసి పెడతానని నమ్మబలికి తనకు కావాల్సింది పుచ్చుకొని పనిచేసి పెట్టడం ఇతడికి బాగానే అలవాటని సమాచారం. ఆరేళ్లుగా ఒకే చోట పనిచేయడం వల్ల కలెక్టర్ కార్యాలయం లో సీనియర్ గా మారిపోయి ఏ అధికారి వచ్చిన తన మాట చెల్లుబాటు ఐయ్యేలా చేసుకున్నాడట.

పెండింగ్ ఫైళ్ల మాయ….?

గత కలెక్టర్ ఏవో కారణాల వల్ల సంతకం చేయకుండా పెండింగులో పెట్టిన ఫైల్ లను ఈ సూపరింటెండెంట్ దుమ్ము దులుపుతున్నాడట. కొత్త కలెక్టర్ రాగానే సాద్యం కానీ ఫైళ్ళను ఈ సూపరింటెండెంట్ దుమ్ముదులిపి మరీ కదిలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

భారీగా అక్రమాస్తులు…?

వరంగల్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆరేళ్లుగా అదే కుర్చీకి అతుక్కుపోయి మర్రిచెట్టులా పాతుకుపోయిన ఈ సారు అనేక ఆస్తులు కూడబెడుతున్నట్లు బాగానే ప్రచారం సాగుతోంది… నగరంలో కొన్ని చోట్ల వివిధ ఆస్తులు కూడబెట్టినట్లు ప్రచారం బాగానే జరుగుతుంది.ఆరేళ్ళ కాలంలో బాగానే అక్రమ ఆస్తులు కూడబెట్టిన ఇతగాడిపై విచారణ జరిపితే ఆస్తులు బాగానే బయటపడుతాయని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో గుసగుసలు వినపడుతున్నాయి.

కదిలిన ఏవో… కదలని సూపరిండెంట్

కలెక్టర్ కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేసిన ఏవో ఎట్టకేలకు బదిలీ కాగా ఆయన కంటే ముందు నుండి క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న సూపరిండెంట్ బదిలీ కాకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోందని కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు… ఇటివల జరిగిన బదిలీల్లో ఏవో బదిలీపై వెళ్లగా ఈ సూపరింటెండెంట్ మాత్రం అక్కడనుంచి కదలకుండా క్యాంప్ కార్యాలయంలోనే ఉండిపోవడానికి బలంగా పైరవీలు చేసి బదిలీ కాకుండా అడ్డుకున్నట్లు తెలుస్తుంది. ఇంతగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పాతుకుపోయిన ఈ సూపరింటెండెంట్ పై ఉన్నతాధికారులు ఎం చర్యలు తీసుకుంటారో చూడాలి.

పెండింగ్ ఫైల్ ల ధుమ్ము దులుపుతున్నాడట

గత కలెక్టర్ పెండింగ్ లో పెట్టిన ఫైల్ లను ఈ సూపరిండెంట్ సారు ధుమ్ముదులిపి మరీ ఈ కదిలిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here