హన్మకొండ నగరంలోని రోహిణి నర్సింగ్ హాస్టల్ లో ఓ నర్సింగ్ విద్యార్థిని హాత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. తాను ఉంటున్న హాస్టల్ గదిలోనే శనివారం ఉదయం విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నం చేసింది.పూర్తి వివరాల్లోకి వెళితే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి కి చెందిన కందరపు రవళి రోహిణి నర్సింగ్ కళాశాలలో నర్సింగ్ మూడవ సంవత్సరం చదువుతు హాస్టల్ లోనే ఉంటుంది. శనివారం ఉదయం హాస్టల్ గదిలోనే ఉన్న రవళి ఏమైందో ఏమో తెలియదు కాని ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. ఇది గమనించిన తోటి నర్సింగ్ విద్యార్థులు గది తలుపులు బలవంతంగా నెట్టి లోపలికి ప్రవేశించి రక్షించే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన నర్సింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థినిని చికిత్స నిమిత్తం రోహిణి ఆసుపత్రికి తరలించి ఐసియు లో చికిత్స అందిస్తున్నట్లు చెపుతున్నారు.
తల్లిదండ్రుల మధ్య గొడవలతో…?
తరుచుగా తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన నర్సింగ్ విద్యార్థి రవళి ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తోంది.. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు విద్యార్థిని తల్లి రజిత ఈ విషయం స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా విద్యార్థిని రవళి తన తల్లికి వీడియో కాల్ చేసి ఉరి వేసుకుంటున్న అని తెలిపి ఉరి వేసుకున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది.కానీ ఇంత జరుగుతున్నా నర్సింగ్ హాస్టల్ యాజమాన్యం ఎక్కడ పోయిందని ఆమె పోలీసులను ప్రశ్నించింది.ఇదిలాఉంటే తమ మధ్య ఉన్న గొడవలు ఆత్మహత్య యత్నానికి అసలు కారణం కాదని హాస్టల్ ల్లో అసలు ఎంజరిగిందో తెలియాలని విద్యార్థిని రవళి తండ్రి కందారపు తిరుపతి అన్నారు. తమ కూతురు ఐసియు లో ఉందని చెప్పి కేవలం ఒక్క నిమిషం చూపించి ఆతర్వాత ఎన్ని సార్లు అడిగిన తమకూతురును చూపించేందుకు అంగీకరించలేదని ఆయన అన్నారు.
పోలీసుల విచారణ…
నర్సింగ్ విద్యార్థిని రవళి ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నం చేసిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.తల్లిదండ్రులను, తోటి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసుపత్రి యాజమాన్యం ఎదుటే విద్యార్థిని తల్లిదండ్రులను పోలీసులు పలు ప్రశ్నలు వేసి వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశారు.
విద్యార్థి సంఘాల బైఠాయింపు…
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం నేపథ్యంలో రోహిణి ఆసుపత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి.ఆసుపత్రి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.దింతో పోలీసులు కలుగజేసుకొని విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకునిపోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఆందోళనలో టీజీవిపి ,ఎబి ఎస్ ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.