బండా మనుషులమంటూ దౌర్జన్యం…..

హన్మకొండ లోని ఆ కాలనిలో అక్రమంగా నిర్మాణం చేసిందే కాక తాము ఎమ్మెల్సీ బండా ప్రకాష్ మనుషులమంటూ కొంతమంది దౌర్జన్యానికి దిగారట. ఇక్కడ ఏకంగా రోడ్డునే కబ్జా చేసిన ప్రభుద్దులు బండా పేరును చెపుతూ బెదిరింపులకు దిగుతున్నారట. అసలు ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కు వీరికి అసలు సంబంధం ఉందో లేదో తెలియదు కాని ఎమ్మెల్సీ పెరుచేపితే అక్రమం అయిన సక్రమం అవుతుందని వీరు అనుకుంటున్నట్లు ఉంది. దీంతో అక్కడి కాలనీ వాసులంతా ఏకమై తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

బండా మనుషులమంటూ దౌర్జన్యం.....- news10.app

కాలనీ వాసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం… గ్రేటర్ వరంగల్ పరిధిలో భూముల రేట్లు భారీగా పెరగడంతో భూ కబ్జా దారులకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. రాజకీయ నాయకుల అండ దండలతో మున్సిపల్ అధికారులను గుప్పిట్లో పెట్టుకొని కొంతమంది కబ్జా దారులు రెచ్చిపోతుంటే. తాజాగా బండా మనుషులం అంటూ రోడ్డును కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది బండా మనుషులమంటూ హంటర్ రోడ్ లోని శివా హిల్స్ కాలనీలో కోర్టు కేసులో ఉన్న స్ధలాన్ని కబ్జా చేయడమే కాకుండా, కాలనీ వాసులు వెళ్లే రోడ్ ను సహితం కబ్జా చేశారట ఈ కబ్జా రాయుళ్లు. కాగా ఇదేమిటీ అని కాలనీ వాసులు ప్రశ్నించగా మేము బండా మనుషులమంటూ బెదిరిస్తూ, మీకు రోడ్ కావాలంటే ఎంతో కొంత ముట్టచెప్పాల్సిందే అని హుకుం జారీ చేశారట. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా అసలు సాధ్యం కాని చోట వారు దౌర్జన్యంగా రోడ్ కు అడ్డంగా ప్రహారీ గోడను నిర్మించారు.

కమిషనర్ కు పిర్యాదు

అక్రమంగా కాలనీ లోని రోడ్డును కబ్జా చేసి ప్రహారి గోడ నిర్మించిన విషయాన్ని కాలనీ వాసులు ఇటీవల మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యకు పిర్యాదు చేశారట. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను కలిసి శివా హిల్స్ కాలనీ వాసులు ఫిర్యాదు చేసినా, క్రింది స్థాయి అధికారులు మాత్రం కబ్జా దారులకు వత్తాసు పలుకుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.పిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా మున్సిపల్ అధికారులు ఎవరు అటువైపు ఇప్పటికి కన్నెత్తి చూడలేదట. మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు చేశాం చర్యలు తీసుకుంటారని ఆశగా ఎదురుచూస్తున్న కాలనీ వాసులు ఇప్పటికి ఎవరు ఆ కాలనీ కి వచ్చి కనీసం కబ్జా ఐయిన స్థలాన్ని పరిశీలించక పోవడంతో వారు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కేటీఆర్ కు పిర్యాదు చేసేందుకు సిద్ధం

కాగా కాలనిలో ఏకంగా రోడ్డునే కబ్జా చేసిన మున్సిపల్ అధికారులు ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కాలనీ వాసులు న్యాయం కోసం మంత్రి కేటీఆర్ కు పిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈసమస్యపై త్వరలో తమకు ఎలాంటి న్యాయం జరగపోతే కబ్జా విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కాలనీ వాసులు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ విషయంలో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here