ఇటుకబట్టీలలతో తిప్పలు….

ఎలాంటి అనుమతులు లేకుండా, యధేచ్చగా ఇటుకల తయారీ చేస్తూ కాలుష్యం వెదజల్లుతున్న ఆ ఇటుక బట్టీల మూలంగా తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని గ్రామస్తులు అంటున్నారు. గ్రామానికి అతిసమీపంలో, శివారులో ఉన్న చెట్లను అన్నింటినీ నరికేస్తూ,మట్టి కోసం ఖాళీ ప్రదేశాలను బొందల గడ్డగా మారుస్తూ ఇటుకబట్టీల యాజమాన్యం తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్ని సార్లు పిర్యాదు చేసిన అసలు ఫలితమే లేదంటున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారం గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న ఇటుకబట్టి తో గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటుకబట్టీలలతో తిప్పలు....- news10.app

గ్రామ ప్రజలు అనేకసార్లు సమస్యను అధికారుల దృష్టికి తీసుకేళ్ళిన చర్యలు మాత్రం శూన్యం అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనంతారం గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి అతి సమీపంలో ఇటుకబట్టి నిర్వహిస్తున్నారు..సాధారణంగా ఈ వ్యాపారం నిర్వహించాలంటే గ్రామ పంచాయతీ, రెవెన్యూ, మైనింగ్ శాఖల నుండి అనుమతులు తప్పనిసరి కానీ ఇవేమీ లేకుండా ఇటుక బట్టి యజమా నులు తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా కొనసాగిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

బట్టీల నుండి వెలుబడే పొగ దుమ్ము, ధూళి కారణంగా పంట పొలాలు కలిగిన సమీప రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు… దీనిపై గతంలో గ్రామ పంచాయతీ ఇటుక బట్టి ని మూసివేయాలని యజమానికి నోటీసులుకూడా పంపింది .. కానీ వారిలో ఎలాంటి మార్పు రాలేదు… ఇదిలా ఉంటె మరోవైపు హర్యానా, బీహార్ నుండి కార్మికులను రప్పించి వారిని శ్రమ దోపిడీ చేస్తూ బాలకార్మికులను సైతం పనిలో పెట్టుకొని అరకొర కూలీ లు చెల్లిస్తూ వారి రెక్కల కష్టంతో సొమ్ము చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.. అంతేకాదు గ్రామ శివారులో చుట్టు ఉండే చెట్లను నరికి ఇటుకలను కాల్చడం ద్వారా వచ్చే పొగతో గ్రామ ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. గతంలో గ్రామ ప్రజలు పలుమార్లు ఈ అక్రమ వ్యాపారం పై రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది… ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకొని సహజ సంపదను, గ్రామస్తుల ఆరోగ్యాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here