కెఎంసీ నుంచి కదలమంటున్న క్లర్క్ లు
వరంగల్ కెఎంసీలో గత పదిహేనేళ్లుగా క్లర్క్ లు ఎక్కడకు కదలంటున్నారు… ఇన్ని సంవత్సరాలుగా ఈ మెడికల్ కళాశాలలో తిష్ట వేసిన వీరు తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారట. ప్రిన్సిపాల్ లు ఎందరు మారిన ఇతర ఉద్యోగులు బదిలీపై వేరేచోటికి వెళ్తున్న ఇక్కడ పనిచేస్తున్న క్లర్క్ లు మాత్రం ఇక్కడే పాతుకుపోయి ఎవరినైనా శాసించే స్థాయికి ఎదిగారట… వీరిని ప్రశ్నించే ధైర్యం ఈ కళాశాలకు వచ్చిన ప్రిన్సిపాల్ లు సైతం ఎవరు చేయడం లేదంటే వీరు ఈ మెడికల్ కళాశాలలో ఎంతటి బలంగా తిష్ట వేశారో అర్థం అవుతుందని పలువురు అంటున్నారు. ప్రొపెసెర్ ల హాజరు నుంచి విద్యార్థుల హాజరు శాతం వరకు అన్ని మెయింటైన్ చేస్తూ ఈ క్లారికల్ సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు సైతం వీరిపై ఉన్నాయి.
ఫైరవీలు ఘనం…?
కాకతీయ మెడికల్ కళాశాలలో ఏండ్ల కొద్దీ తిష్ట వేసిన ఈ క్లర్కు లు తమను ఎక్కడకు ఎవరు బదిలీ చేయకుండా డి ఎం యి స్థాయిలో పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే తమను ఎక్కడకు బదిలీ చేయకుండా డి ఎం ఇ కార్యాలయంలో ఓ ఉద్యోగికి అడిగింది సమర్పించుకొని బదిలీ ఆపుకున్నారట. ఈ కార్యాలయంలో ఉన్న ఈ ఉద్యోగి అండదండలతో వీరు ఇక్కడ పెత్తనం చేలాయిస్తున్నట్లు తెలిసింది.
ఎందుకింత….?
ఏండ్ల కొద్దీ కెఎంసీలో పాతుకుపోయిన ఈ రెండు పదుల సంఖ్యలో ఉన్న క్లర్క్ లు ఇక్కడే ఉండేందుకు పట్టుబట్టడానికి అనేక కారణాలు ఉన్నాయట. ఈ కళాశాలలో తరుచుగా వచ్చే చిన్న చిన్న కాంట్రాక్ట్ లు బినామీ పేర్లపై వారే దక్కించుకుంటారట. అంతేకాదు హాజరు శాతం తక్కువగా ఉన్న విద్యార్థులకు హాజరు శాతం పెంచేందుకు బాగానే డిమాండ్ చేసి ముక్కుపిండి మరీ వసూలు చేస్తారట. ఇక్కడి నుంచి బదిలీ పై వెళితే ఈ అదనపు ఆదాయానికి గండి పడుతుంది కనుక ఇక్కడనుంచి ఏమాత్రం కలదలకుండా ఏండ్లు గడిచిన ఇక్కడే నౌకరి చేస్తూ అధికారులను సైతం శాసించే స్థాయికి ఈ క్లర్క్ లు ఎదిగిపోయారట… కళాశాలలో విధుల నిర్వహణలో సైతం వీరి ఇష్టారాజ్యమే నడుస్తుందట… ఇష్టం ఉంటే చేస్తారు లేదంటే రేపు మాపు అంటూ కాలం గడుపుతు అధికారులు చెప్పిన మాటలను సైతం వీరు పెడచెవిన పెడతారట. అవును మరి సంవత్సరాలకొద్ది ఒకే చోట ఉద్యోగం చేస్తూ తిష్ట వేస్తే ఇలాగే ఉంటుందని కెఎంసీలో ని కొంతమంది ఉద్యోగులు వారిగురించి కామెంట్ చేస్తున్నారు. పైస్థాయిలో సంబంధాలు ఉన్నాయని వారి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. మరి కెఎంసీలో పాతుకుపోయిన ఈ క్లర్క్ లను ఉన్నతాధికారులు బదిలీ చేస్తారా… లేక పైరవీలకు తల్లోగ్గి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఐయిన ఇక్కడే కొనసాగిస్తారా…? చూడాలి.