ఆర్సీఓ ఇష్టారాజ్యం
హసన్ పర్తి మండలం జయగిరి మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల కళాశాలలో కబడ్డీ ఆడుతూ విద్యార్థి మృతిచెందిన ఘటనపై అధికారులు ఇప్పటివరకు నివేదిక సమర్పించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కళాశాలలో ఓ విద్యార్థి మరణించిన అధికారులకు ఎలాంటి పట్టింపు లేకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కనీసం కళాశాలలో జరిగిన సంఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోకుండా వారు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కాకుండా ఉంది.
కలెక్టర్ చెప్పిన….
కబడ్డీ ఆడుతూ విద్యార్థి మృతిచెందిన విషయం కలెక్టర్ దృష్టికి వచ్చిన వెంటనే తనకు పూర్తి నివేదిక కావాలని ఆర్ సి ఓ ను ఆదేశించిన. కలెక్టర్ ఆదేశాలను ఆర్ సి ఓ పెడచెవిన పెడుతూ ఇప్పటివరకు ఆ ఘటనపై నివేదిక ఇవ్వకుండా కలెక్టర్ ఆదేశాలనే భేఖాతార్ చేసినట్లు తెలుస్తోంది… సంఘటనకు బాద్యున్ని చేస్తూ ఆ కళాశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని కలెక్టర్ చెప్పిన ఆర్ సి ఓ సస్పెండ్ చేసి అధికారం తనకు లేదని చేతులుదులుపుకోవడం కనీసం ఆ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్సీఓ ఎందుకు ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఉన్నతాధికారులకే తెలియాలి.
నివేదిక ఎప్పుడో పంపా… ప్రిన్సిపాల్
కబడ్డీ ఆడుతూ విద్యార్థి గాయపడి మరణించిన విషయంలో ఎప్పటికప్పుడు ఆ ఘటనకు సంబంధించి న వివరాలను తాను ఆర్సీఓ కు చెప్పానని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ న్యూస్10 కు తెలిపారు.విద్యార్థి మృతికి సంబంధించిన విషయంలో ప్రిన్సిపాల్ ను న్యూస్10 ప్రతినిది వివరణ కోరగా ఆయన పలు విషయాలను వెల్లడించారు… తాను ఏ విషయాన్ని దాయాలని చూడలేదని ,విద్యార్థి మృతి విషయంలో అన్ని వివరాలు ఆర్ సి ఓ కు అందిస్తూనే ఉన్నానన్నారు. ఈ ఘటన విషయంలో తాను ఎప్పుడో ఆర్సీఓ కు నివేదిక సమర్పించానని వెల్లడించారు.
మండి పడుతున్న ఆర్సీఓ..
గురుకుల విద్యార్థి మృతి విషయంలో వివరణ అడిగితే చాలు ఆర్ సి వో మనోహర్ రెడ్డి మండిపడుతున్నారు. అసలు ఈ విషయం మీకెందుకు… అన్నట్లు మాట్లాడుతున్నారు.వార్త ఎలా రాయాలో తానే క్లాస్ తీసుకున్నాడు… అసలు విషయం వదిలి గతంలో ఈ వార్త రాశారు అప్పుడు ఆ వార్త రాశారని తనకు సంబంధం లేని విషయాలపై ఆర్సీఓ మండిపడుతూ న్యూస్10 ప్రతినిధి వివరణ అడిగినందుకు ఫోన్ లోనే తెగ సీరియస్ ఐయిపోయారు… పొంతనలేని మాటలతో సమాధానం చెప్పారు… కలెక్టర్ కు నివేదిక సమర్పించకుండానే నివేదిక సమర్పించినట్లు నోటికివచ్చినట్లు అబద్దాలు ఆడారు. కనీస మర్యాద లేకుండా ఫోన్ లో మాటలతోనే రెచ్చిపోయారు. విద్యార్థి మృతి నివేదిక సమర్పణ విషయంలో వివరణ ఆడిగితేనే ఆర్సీఓ ఇంతగా ఎందుకు స్పందించారో అర్థం కాకుండా ఉంది… ఆర్సీఓ ఇంకో అడుగు ముందుకు వేసి సీట్లు ఇవ్వనందుకే కొందరు ఇలా చేస్తున్నారని అసలు అవసరం లేని విషయాన్ని ప్రస్తావించి ఏది తోస్తే అది మాట్లాడారు…
కలెక్టర్ స్పందించాలి….
గురుకుల విద్యార్థి మృతి విషయంలో ఇప్పటికి నివేదిక సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, ఆర్డీవో ల వ్యవహారంపై కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కలెక్టర్ ఆదేశించిన తనకేం పట్టనట్లు వ్యవహరిస్తున్న ఆర్సీఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలని వారు కోరుతున్నారు. మరి వీరి విషయంలో కలెక్టర్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.