హన్మకొండ జిల్లాలో కొన్ని ప్రయివేటు ఆసుపత్రులు వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణ లేక తమ ఇష్టారాజ్యాంగ వ్యవరిస్తున్నాయి.అర్హత లేని వైద్యులతో వైద్యం చేయిస్తూ కాసులు దండుకునే పనిలో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఇటీవల హన్మకొండలోని కాకాజీ కాలనీలోని ఓ ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో అర్హత లేని బి ఏ ఎం ఎస్ డాక్టర్ తో ఓ సీనియర్ వైద్యుడు సర్జరీలు చేయిస్తున్న ఘటన వెలుగులోకి రాగా ఇదే తరహాలో మరికొన్ని ఆసుపత్రుల్లో సైతం అర్హత లేని వైద్యులు వైద్యం చేస్తూ వైద్యం కోసం వచ్చిన రోగులకు అదనపు సమస్యలు సృష్టిస్తున్నట్లు తెలిసింది.తక్కువ వేతనాలతో అర్హత లేని వైద్యులను తమ ఆసుపత్రుల్లో నియమించుకొని చదివిన వైద్యం ఒక్కటి ఆసువుత్రుల్లో చేసే వైద్యం ఒక్కటిగా మారిందట.కొన్ని ఆసుపత్రుల్లో బి ఏ ఎం ఎస్ డాక్టర్లకు సంబంధం లేని వైద్యం చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలా హన్మకొండ నగరంలో పలు ఆసుపత్రుల్లో అర్హత లేని డాక్టర్ లు వైద్యం చేస్తూ ఆసుపత్రులను వారే నెట్టుకొస్తున్నట్లు తెలిసింది.అర్హత ఉన్న వైద్యులు పేరుకు ఆసుపత్రులు నెలకొల్పి తాము వైద్యం చేయకుండా నెల వారి వేతనం చెల్లిస్తూ బిఎ ఎం ఎస్ డాక్టర్ లను నియమించుకుంటున్నారట.ఇలా ఒక్క హన్మకొండ నగర పరిధిలోనే అర్హత లేని డాక్టర్ లు ఉన్న ఆసుపత్రులు ఎక్కువగానే ఉన్నట్లు తెలిసింది.ఐయితే ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలిసిన వారిపై చర్యలు తీసుకోకుండా మీనా మేషాలు లెక్కిస్తున్నట్లు తెలిసింది.
అనుమతులు ఏవి….?
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులు నెలకొల్పి కనీస నిబంధనలు పాటించకుండా ఉన్న ఆసుపత్రులు నగరంలో చాలానే ఉన్నాయి.ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ఆసుపత్రులు నడుస్తున్నాయి.కొన్ని ఆసుపత్రులు తాత్కాలిక అనుమతులు మాత్రమే తీసుకొని ఆ అనుమతి కాలం చెళ్లిన శాశ్వత అనుమతులు తీసుకోకుండా తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తూ ఆసుపత్రులను నిర్వహిస్తున్నారు.అధికారులు సైతం వీరికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.ఎలాంటి అనుమతులు లేకున్నా ఆసుపత్రులను అధికారులు చూసి చూడనట్లు వదిలిపెడుతున్నట్లు తెలిసింది.
మౌనం ఎందుకు…?
అర్హత లేని వైద్యులతో వైద్యం చేయిస్తూ…అనుమతులు లేకుండా ఆసుపత్రులపై చర్యలు తీసుకోకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మౌనంగా ఉండడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.నగరంలో ఏ ఏ ఆసుపత్రుల నిర్వహణ ఎలావుందీ. అనుమతుల విషయం అధికారులకు తెలిసిన చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనుకాడటం పట్ల విమర్శలు వస్తున్నాయి.వైద్యం కోసం వెల్లి ఇబ్బందులు ఎదురయ్యిన కొంతమంది అధికారులకు ఫిర్యాదు చేసిన వారు మాత్రం ఆసుపత్రులను తనిఖీ చేయడం మనే మాట అటుంచితే కనీసం వారిని మందలించే సాహసం చేయకపోవడం వెనుక ఆసుపత్రి యాజమాన్యాలకు ,అధికార్రులకు ఎదో లోపాయకారి ఒప్పందం ఉన్నట్లు గా బహిరంగంగానే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు లేకుండా ,కనీస నిబంధనలు పాటించకుండా ఉన్న ఆసుపత్రులను అధికారులు తనిఖీ చేసి మూసి వేయకుండా వారి వైద్య వ్యాపారానికి సహకరిస్తున్నట్లు గా వ్యవహరిస్తున్నారని పలువురు అంటున్నారు.ఇకనైనా ఇలాంటి ఆసుపత్రులపై దృష్టి సారించి అధికారులు కొరడా జులిపిస్తారో లేదో చూడాలి.