- చెరువులో వెంచర్ పై “కుడా” అధికారులు ఆగ్రహంతో ఉన్నారా?
- చోటా నయీమ్ పై క్రిమినల్ కేసులు పెట్టేందుకు హసన్ పర్తి తహసీల్దార్ సిద్ధమయ్యార?
- రేపో మాపో వెంచర్ ప్రహారీని,హద్దురాళ్లను “కుడా” తొలగించనుందా?
- చోటా నయీమ్ చెరువును మింగుతుంటే అధికారులు ఎందుకు గమ్మునున్నారు?
- నాల కన్వర్షన్,ఎఫ్టీఎల్ అనుమతులు లేకున్నా రిజిస్ట్రేషన్ లు ఎలా జరిగాయి ఏ అధికారి ఎంత తీసుకున్నారు
- పదుల సంఖ్యలో చోటా నయీమ్ బాధితులు న్యూస్-10తో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు
హసన్ పర్తి మండలం వంగపహాడ్ శివారు లో ఉన్న చింతల చెరువులో అక్రమంగా వెలిసిన వెంచర్ పై అధికారులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. న్యూస్10 కథనం తో ఇప్పటికే కదిలిన రెవెన్యూ యంత్రాంగం వెంచర్ వేసిన ప్రాంతాన్ని పరిశీలించి భూమికి సంబంధించిన కొలతలు తీసుకోగా… ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ వేయడంపై కుడా అధికారులు సైతం రేపో మాపో చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఎలాంటి అనుమతులు లేని కారణంగా వెంచర్ హద్దులు తొలగించ నున్నట్లు తెలియవచ్చింది.
ఈ విషయాన్ని కూడా అధికారులు మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించినట్లు సమాచారం.చోట నయీమ్ గా పిలవబడుతూ కబ్జాలు, వివాదాస్పద భూముల్లో తలదూర్చుతున్న టీఆర్ఎస్ నాయకుడిపై హాసన్ పర్తి రెవెన్యూ అధికారులు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.ఇది ఇలావుంటే చెరువు భూమిని కబ్జా చేసి వెంచర్ వేసి ప్లాట్లు విక్రహిస్తుంటే అధికారులు ఎందుకు గమ్మున ఉన్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాము ఈ వెంచర్ పై పలుమార్లు పిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు. కాగా నాల కన్వర్షన్, ఎఫ్ టి ఎల్ అనుమతులు లేకున్నా ప్లాట్ల రిజిస్ట్రేషన్ లు ఎలా జరిగాయి అనేది ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది… ఈ అక్రమ రిజిస్ట్రేషన్ లకు భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చెరువులో వెంచర్ కథనం న్యూస్-10 లో వెలువడగానే సదరు అక్రమార్కుడి కబ్జా లీలలపై భాదితులు తమ ఆవేదన వెలిబుచ్చారు. పదుల సంఖ్యలో భాదితులు తాము ఎలా మోసపోయామో చెప్పారు.కబ్జాలు,అమాయకులను మోసం చేస్తూ కోట్లకు పడగలెత్తిన గులాబీ నాయకుడి బండారాన్ని తన కథనాలతో న్యూస్-10 త్వరలోనే బయటపెట్టనుంది.
చెరువును ఆసరాగా చేసుకుని కోట్లకు పడగలెత్తిన గులాబీ నాయకుడిపై సమగ్ర *కథనాలు త్వరలో మీ న్యూస్-10పత్రికలో