ధాన్యం కొనుగోలు లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. పత్తిపాక గ్రామంలో ఉన్న కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం సత్యనారాయణ రావు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర నిర్ణయించి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, రాష్ట్రంలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తే 10 వేల కోట్లు ఖర్చు అవుతాయని, వైన్స్ షాప్ లో పేరిట 12 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వసూలు చేసిందని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఆయకట్టు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం దానివల్ల రైతులు వరి పంట తప్ప వేరే పంట పండించే లేని దుర్భరమైన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.
వాణిజ్య పంటలు పండించాలంటే భూమి తడి ఆరడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే దమ్ము టిఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. హాయ్ పండించిన పంటకు మద్దతు ధర ప్రకటించి ఆర్డినెన్స్ తేవాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేంద్రం మెడలు వంచి రద్దు చేసుకున్న ఘనత రైతులదేనని కానీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేస్తేనే రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేసిందని అధికార పార్టీ నాయకులు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. పత్తి క్వింటాల్ ధర 10 వేలు, మిర్చి 15 వేలు, దొడ్డు రకం ధాన్యానికి 2 వేలు సన్న రకానికి 3 వేల రూపాయల మద్దతు ధర కోసం కేంద్రంతో పోరాటం చేసి ఆర్డినెన్స్ తీసుకురావాలన్నారు.
760 మంది రైతుల ప్రాణత్యాగాలు తోనే రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేసిందని అన్నారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అన్నారు. అకాల వర్షం కారణంతో రైతుల దగ్గర 4 నుండి5 కిలోల ధాన్యాన్ని తరువు పేరుతో దోపిడీ పాల్పడితే ఊరుకునేది లేదని, గతంలో లో కోళ్ల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రైతులను ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. రైతులు లు ఏ రకం ధాన్యం పండించిన ప్రభుత్వం వన్ ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, మేం చెప్పిందే పండించాలని రైతులకు హుకుం జారీ చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులు యాసంగి పంటలు పండించ కుండా ఉండేందుకు ఎకరానికి 25 వేల రూపాయలు చెల్లించాలన్నారు. రైతులకు ఇష్టమైన పంటలను పండిస్తూ ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా ప్రత్యేక చట్టం కోసం, కేంద్ర ప్రభుత్వం ధరలను నిర్ణయించే చట్టాన్ని తీసుకొచ్చేందుకు అందరం కలిసి పోరాటాలు చేయాలని అన్నారు. ఇప్పటికే సమయం మించిపోయిందని తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ లను మాఫీ చేసి రైతులకు ఇష్టమైన పంటలను పండించిన కొనుగోలు చేస్తామన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ తమ వెన్నంటే ఉండి రైతు కష్టాల్లో పాలు పంచుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి వలీ హైదర్ జంగారెడ్డి బుచ్చిరెడ్డి మారేపల్లి రవీందర్ కట్టయ్యా వెంకట్ రాజి రెడ్డి, కాంగ్రెస్ యూత్ నాయకులు ఐరా బోయిన రాజు, బల్గూరి రాజు తుడుం మహేష్ తదితరులు పాల్గొన్నారు.