హన్మకొండ జిల్లాలోని పలివేల్పుల ధాన్యం కొనుగోలు కేంద్రం లో కొనుగోళ్లు లేకున్నా కొనుగోళ్లు చేసినట్లు చూపి లక్షల రూపాయలు అక్రమానికి పాల్పడడంలో వరంగల్ నగర శివారులోని ఓ మిల్లు ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిసింది. ధాన్యం కొనుగోళ్లు జరగకున్న జరిగినట్లు రికార్డుల్లో చూపించి, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ మిల్లుకు పంపినట్లు అధికారులు రికార్థుల్లో నమోదు చేసినట్లు తెలుస్తోంది.మొత్తం 40 మంది ఈ సెంటర్ లో దాన్యం అమ్మినట్లు అధికారులు రికార్డుల్లో చూపగ ఇందులో 33 మంది రైతుల ఖాతాల్లోంచి సుమారు 50 లక్షలకు పైగా డబ్బులు మిల్లర్ ఖాతాలోకి, మిల్లర్ సతీమణి ఖాతాలోకి బదిలీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.
ముందుగా రైతులు ధాన్యం అమ్మినట్లు తమకు పరిచయం ఉన్న రైతుల వివరాలు, ఖాతా నెంబర్ రికార్డుల్లో పొందుపరిచిన అధికారులు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం సర్కార్ నుంచి ధాన్యం డబ్బులు వారి ఖాతాల్లో పడగానే అక్కడినుంచి మిల్లర్ ఖాతాకు నగదు బదిలీ అయినట్లు తెలిసింది. ఓ అధికారి, ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కలిసి మిల్లరుతో కుమ్మకై ఈ అక్రమానికి పాల్పడినట్లు అధికారుల విచారణలో సైతం బయటపడినట్లు తెలిసింది. పలివేల్పుల ధాన్యం కొనుగోలు అక్రమాల్లో ఆ మిల్లర్ పాత్ర కూడా బాగానే ఉన్నట్లు అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు తెలియవచ్చింది.
అధికారులను కాపాడుతున్న పెద్ద సారు….?
సర్కార్ సొమ్ము దిగమింగిన కొంతమంది అక్రమార్కుల పై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్న సివిల్ సప్లై కి చెందిన ఓ రాజకీయ పార్టీ కి చెందిన పెద్ద సారు మూలంగా చర్యలు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది… సివిల్ సప్లై కి చెందిన నామినేటెడ్ పోస్ట్ లో కొనసాగుతున్న ఈ సారు పలివేల్పుల స్కామ్ లో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న సివిల్ సప్లై కి చెందిన ఓ అధికారిని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తుండడంతో ఆ అధికారిపై చర్యలు ఉన్నతాధికారులు వెనుకాడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఈ కొనుగోలు కేంద్రంలో అసలు ధాన్యం కొనుగోళ్లు జరగకున్న రవాణా చార్జీలను సైతం జిల్లా మేనేజర్ చెల్లించినట్లు తెలిసింది. అసలు కొనుగోళ్లు జరగకున్న రవాణా ఛార్జీలు అంత గుడ్డిగా ఎలా చెల్లించారో ఆ అధికారికే తెలియాలి. ఈ రవాణా చార్జీలే కాకుండా ప్రస్తుతం 13 వేల గన్ని బ్యాగుల విషయంలో సైతం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కొనుగోళ్లే జరగనపుడు ఈ 13 వేల గన్ని బ్యాగులు ఎక్కడికి పోయాయి అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది. వీటిని సైతం మూడో కంటికి తెలియకుండా అధికారులు,మిల్లర్ కలిసి అమ్మి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా పలివేల్పుల దాన్యం కొనుగోలు కేంద్రం లో అక్రమాలు జరిగినట్లు,కొనుగోళ్లు జరగకున్న డబ్బులు స్వాహా చేసినట్లు పూర్తి ఆధారాలు ఉన్నా ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిగి అది నిజమేనని తేలిన ఉన్నతాధికారులు చర్యలకు వెనుకాడడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి… అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకుండా అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడంలేదు. మొత్తానికి ఈ కొనుగోలు అక్రమాల్లో మిల్లర్ పాత్ర , కొందరు అధికారుల పాత్రపై మరింతగా లోతుగా ఆరా తీస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఏదిఏమైనా ఇంతటి అక్రమానికి పాల్పడిన మిల్లర్,కొందరు అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటార… లేదా చూడాలి.