దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ విదిస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మంగళ వారం ఆయన జాతిని ఉదేశించి ప్రసంగించారు. కరోనపై ప్రజల నిబద్ధతను ఆయన ప్రశంసించారు సైనికుల్లా పోరాడుతున్న ప్రజలకు నా మనస్సులు అన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అంబేత్కర్ స్ఫూర్తి ఇలాంటి విపత్తులపై పోరాటానికి బలమిస్తుందన్నారు. కష్టమైన నష్టమైనా దేశం కోసం ప్రజలు నిలబడ్డారన్నారు. భౌతిక దూరం,లాక్ డౌన్ మూలంగా దేశానికి మేలు జరుగుతుంది అన్నారు. లాక్ డౌన్ ప్రకటించకుంటే పరిస్థితి తీవ్రంగా ఉండదన్నారు.