డాట్ థెరపీ ద్వారా ఓ వ్యాధికి చికిత్స నందించే ఆ పెద్దాసుపత్రిలో సూపరింటెండెంట్,ఆర్ ఎం ఓ ల ఇష్టారాజ్యం కొనసాగుతుందట.విధులకు హాజరు కానున్న పుల్ హాజరు తో జీతం తీసుకునే వీరిని కనీసం ఇదేంటని ప్రశ్నించే అధికారులు కూడా లేరట.ఇలా వీరు విధులకు డుమ్మా కొట్టి విధులకు హాజరు కానున్న సంతకాలు పెడుతూ ఇంట్లోనే ఉంటూ జీతం అందుకుంటున్న వీరికి అదే ఆసుపత్రిలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ ఫుల్ గా సహకరిస్తున్నాడట…మొత్తానికే డుమ్మాలు కొడుతున్న సార్,మేడమ్ లకు ధైర్య వచనాలు చెబుతున్నాడట.ఏ పని చేయాలన్న చేతివాటాన్ని కాసింత ఎక్కువగానే చూపించే ఈ సీనియర్ అసిస్టెంట్ సార్ ఏం కాదు నేను చూసుకుంటూ మీకు వీలున్నప్పుడే రండి అదీ ట్రెజరీ బిల్స్ ఉన్నప్పుడు నేనే కబురు పెడుతా వచ్చి సంతకాలు పెడితే చాలు రోజు రానవసరంలేదు అంత దూరం నుండి ఎలా వచ్చివెళ్తారు అని డుమ్మాలు కొడుతున్న సూపరింటెండెంట్ సారు పై తెగ సానుభూతి చూపుతున్నాడట.అంతేకాదు సూపరింటెండెంట్ సారు ఎక్కడ కష్ట పడతాడేమోనని పీజీ విద్యార్థులకు క్లాస్ లు కూడా చెప్పక్కర్లేదు అంతా నేనే చూసుకుంటా అని అభయం ఇచ్చేసాడట. ఆసుపత్రిలో ఎవరి జీతాలు రావాలన్న, ఏ ఫైల్ ముందుకు కదలాలన్న ,బిల్స్ పెట్టాలన్న సదరు ఉద్యోగి కనుసన్నల్లోనే జరుగుతుందట పెద్దసారు, మేడం రోజు రాకున్న ఇతగాడు కవర్ చేస్తాడు కాబట్టే ఇతగాడి కనుసన్నల్లోనే ఆ ఆసుపత్రి నడుస్తుందంటూ ప్రచారం జరుగుతోంది
ట్రెజరీ బిల్స్ ఉంటేనే సూపరిండెంట్ వస్తాడట?
డాట్ పేరుతో ఓ ప్రత్యేక వ్యాధికి చికిత్స అందించే ఆ ఆసుపత్రిలో సూపరిండెంట్ అసలే విధులకు రారని అందుబాటులో ఉండరని తెలుస్తుంది పీజీ విద్యార్థులకు క్లాసులు చెప్పాల్సిన ఆ సారు అసలు క్లాసులు చెప్పిన దాఖలాలే లేవట… ట్రెజరీ బిల్స్ ఉన్నరోజే ఆసుపత్రికి వచ్చి సంతకాలు చేసి వెళ్తారట.
ఉన్నతాధికారులకు పట్టదా….?
సర్కార్ ఆసుపత్రిలో ప్రధానమైన రెండు హోదాలో ఉన్న ఇద్దరు వైద్యులు అసలు ఆసుపత్రి మొహం చూడకుండా గుట్టుచప్పుడు కాకుండా హాజరు బుక్ లో నెల కోసారి సంతకాలు పెట్టి విధులకు హాజరైనట్లు నెల నెలా క్రమతప్పకుండా జీతం తీసుకుంటున్న ఉన్నతాధికారులు వీరిపై ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది….ఆసుపత్రికి రాకుండా తమ ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్న వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి అధికారులవల్ల ప్రజాధనం వృధా తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అంటున్నారు.