అర్ధరాత్రి గుట్కా దందా..@హన్మకొండ బస్ స్టాండ్

ఓవైపు గంజాయి,గుట్కా దందాలకు తెరవేసి రాష్ట్రంలో వీటి జాడ లేకుండా చేయాలని సర్కార్ పట్టుదలతో ఉంటే కొంతమంది మాత్రం ఈ రెండు అక్రమ వ్యాపారాలతో లక్షలు వెనుకేసుకోవాలని చూస్తున్నారు… మొన్నటివరకు వరంగల్ త్రినగరిలో ఎక్కడ గుట్కాలు అమ్మిన రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకోగా ఇంకా కొంతమంది అక్రమ గుట్కా వ్యాపారస్తుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నగరంలో ఇంకా గుట్కా అమ్మకాలు బహిరంగంగానే విచ్చలవిడిగా కొనసాగు తున్నాయి….

అర్ధరాత్రి గుట్కా దందా..@హన్మకొండ బస్ స్టాండ్- news10.app
గుట్కా కేరాఫ్ హన్మకొండ బస్ స్టాండ్…

నగరంలో అర్ధరాత్రి దాటిన గుట్కాలు కావాలంటే హన్మకొండ బస్ స్టాండ్ లోని పాన్ షాపు లను సంప్రదిస్తే చాలు ఏ గుట్కా కావాలన్న చిటికెలో ఇస్తారు… అసలే గుట్కా నిషేధం నడుస్తున్న రోజులు కనుక ఉన్న ధర కంటే డబుల్ డబ్బులు తీసుకుంటారు. బస్ స్టాండ్ లోని పాన్ షాప్ లల్లో అర్థరాత్రి దాటినా గుట్కా దందా నిరాటంకంగా కొనసాగుతుంది.నగరంలో రాత్రి పూట గుట్కా ఎక్కడ దొరకకున్న గుట్కా ప్రియులు ఇక్కడకు వచ్చి డబుల్ రేట్ చెల్లించి గుట్కాలు కొనుగోలు చేస్తున్నారు.. మరి ఇంతటి యధేచ్చగా గుట్కాలు అమ్మితే ఎం కాదా… అని పాన్ షాపుల యజమానులను ప్రశ్నిస్తే ఏముంది కొన్నిసార్లు పట్టుకుంటూనే ఉంటారు మళ్ళీ తాము అమ్ముతూనే ఉంటామని చాలా సింపుల్ గా వారు సమాధానం చెప్పారు.

పేరుకే పెట్రోలింగ్….?

రాత్రి పూట పోలీసుల పెట్రోలింగ్ బస్ స్టాండ్ లో పేరుకే జరుగుతుందని విమర్శలు వస్తున్నాయి.రాత్రిపూట పోలీసుల పెట్రోలింగ్ వాహనం వస్తుంది సైరన్ వేస్తుంది వెళ్తుంది….వారు వచ్చినపుడు షాప్ ల యజమానులు దుకాణాలు మూసినట్లు చేస్తారు వారు వెళ్లిపోగానే మళ్ళీ తెరుస్తారు… ఇలా రోజు వారి తంతు బస్ స్టాండ్ ప్రాంతంలో కొనసాగుతుంది. ఇక్కడ అర్ధరాత్రి గుట్కా అమ్మకాల దందా జోరుగా నడుస్తున్న పోలీసులు ఎంతమాత్రం పట్టించుకోక పోవడం గుట్కా అక్రమ అమ్మకం దారులకు భయం లేకుండా పోయింది.ఇక్కడ గుట్కా అమ్మకాలు జరుగుతున్న పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… గుట్కాల అమ్మకం విషయంలో కఠినంగా వ్యవహరించాలని సర్కార్ చెబుతున్న ఇంతటి బహిరంగంగా గుట్కాల అమ్మకం జరుగుతున్న పోలీసులు పట్టించుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా బస్ స్టాండ్ ప్రాంతంలో అక్రమ గుట్కా అమ్మకాలకు పోలీసులు చెక్ పెడతారా…? లేదా చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here