మార్కెట్ వద్దు…’కుడా’ ముద్దు?

తెలంగాణ ఉద్యమం నుంచి ఎంతో మంది ఉన్న వారు సంవత్సరాలుగా అవకాశాలకోసం ఎదురుచూస్తున్న గులాబీ పార్టీ లో సరైన ప్రాముఖ్యత దక్కడం లేదని చాలామంది అసంతృప్తితో ఉండగా ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు తమ అనుచరులకు నామినేటెడ్ పదవులు ఇప్పించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తన అనుచరుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పించడానికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే తన సర్వశక్తులు ఒడ్డుతుండగా తాజాగా మరో ఎమ్మెల్యే తన అనుచరుడికి నామినేటెడ్ పదవి ఇప్పించడానికి శతవిధాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది.

మార్కెట్ వద్దు...'కుడా' ముద్దు?- news10.app

ఈ నామినేటెడ్ పదవి తన సన్నిహితుడు, అనుచరుడికి ఇప్పించడానికి తన నియోజకవర్గానికి మరోమారు ఇస్తామన్న మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని వద్దని తన సన్నిహితుడికి కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ ‘కుడా’ ఛైర్మెన్ పదవి కావాలని కోరుతున్నట్లు తెలిసింది.. గత నెల రోజుల నుంచే మార్కెట్ వద్దు ‘కుడా’ ముద్దు అని అధిష్టానం వద్ద తన ప్రతిపాదనను ఉంచినట్లు తెలిసింది.

పరకాల నియోజకవర్గానికి చెందిన ఓ సీనియర్ ఉద్యమకారుడికి మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చే అవకాశం ఉన్న ఆ ఎమ్మెల్యే అధిష్టానం వద్ద ఆ ప్రతిపాదనను తిరస్కరించి ఇంకా రెండు మూడు నెలల్లో ప్రస్తుత ఛైర్మెన్ పదవీకాలం ముగియనున్న ‘కుడా’ ఛైర్మెన్ పదవి కావాలని కోరుతున్నట్లు సమాచారం… టీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ లు, ఉద్యమకారులను కాదని ఎమ్మెల్యే తన అనుచరుడికి నామినేటెడ్ పదవి కావాలని కోరడం వారిలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది… ఇప్పటికే పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే తనతో పాటు గులాబీ పార్టీలోకి వచ్చిన టిడిపి నాయకులు, కార్యకర్తలకే అవకాశం ఇస్తూ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. విరినెవరిని ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని పరకాల గులాబీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది… పార్టి పదవుల్లో అంతటా టిడిపి నుంచి వచ్చినవారే ఉన్నారని గులాబీ సీనియర్ లు కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలిసింది… వీటికి తోడు నామినేటెడ్ పదవి సీనియర్ లను, ఉద్యమకారులను కాదని తన అనుచరుడికోసం ఎమ్మెల్యే ముందస్తుగా ప్రయత్నాలు చేయడం పరకాల టీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది… అసలే నామినేటెడ్ పదవుల కోసం టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సంవత్సరాలుగా ఎదురుచూస్తుండగా వారిని కాదని ఎమ్మెల్యేలు తమ అనుచరులను నామినేటెడ్ పోస్టులతో అందలం ఎక్కించాలని చూడడం సొంత పార్టీలోనే విమర్శలకు దారితీస్తోంది. మరి ఎమ్మెల్యేలను కాదని సీనియారిటీ, ఉద్యమకారులకు నామినేటెడ్ పోస్టుల్లో గులాబీ అధిష్టానం స్థానం కల్పిస్తుందో లేదో చూడాలి.