డీజిల్ మాయ ఆ పెద్ద సారుదేనా…?

ఆ పెద్ద సారు పరపతి కి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో అడ్డే లేదు..
కార్పొరేషన్ లో డీజిల్ దొంగల కొత్త కోణం…. రోజకు దాదాపు 300 లీటర్ల డీజిల్ కి బిల్లు పెట్టాల్సిందే
మిగిలిన డీజిల్ డబ్బు వారానికోసారి పంపకాలు
హన్మకొండ లోని ఓ రహస్య ప్రాంతంలో మధ్యవర్తి చేతి వాటం
మధ్యవర్తి ద్వారా నగదు ఎవరికి ముడుతున్నాయి?
బల్దియా ఖజానాకు గండి కొడుతున్న అధికారి ఎవరు?

వరంగల్ న్యూస్ 10 నిఘా

గ్రేటర్ వరంగల్ కార్పోరేషన్ లో డీజిల్ దొంగల వెనుక ఓ అధికారి హస్తం ఉన్నట్లు కార్పొరేషన్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కార్పొరేషన్ ఆ అధికారి ఉద్యోగం చేయడం మొదలు పెట్టిన దగ్గరనుంచి కార్పొరేషన్ ఖజానాకు తనకు తోచిన విదంగా గండి కొడుతున్నట్లు సమాచారం.

డీజిల్ మాయ ఆ పెద్ద సారుదేనా...?- news10.app

ఈ అధికారి సహకారంతో కొందరు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఫాగింగ్ మిషన్ లో వాడుతున్న డీజిల్ ను కొట్టివేసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. బిల్లులు మంజూరు చేసేది ఆ పాగింగ్ మిషన్ ఆటోలు పనిచేసినట్లు నిర్దారణ చేసేది ఈ అధికారి కనుక ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతున్నట్లు తెలిసింది.పాగింగ్ మిషన్ పనిచేసిన చేయకున్న వరంగల్ నగరంలో ఉన్న 66 డివిజన్ లలో 4 ఆటోలకు గాను ఫాగింగ్ మిషన్ లో ప్రతి రోజు దాదాపు 300 లీటర్ల డీజిల్ వాడకం జరుగుతున్నట్టు రికార్డులు చూపుతున్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఒక్కో ఆటోలో 70 లీటర్లకు గంటన్నర తిరగవల్సిన ఆటో కేవలం గంట మాత్రమే తిరుగుతూ 20 లీటర్ల డీజిల్ ఆదా చేస్తూ అక్రమంగా మిగిలిన డీజిల్ ను అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు వినవస్తున్నాయి.

ఇలా మిగిలిన డీజిల్ ను అమ్మగా వచ్చిన మొత్తాన్ని వారానికి ఒకసారి హన్మకొండ లో ఒక రహస్య ప్రాంతంలో నగదును పంపకాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం …ఈ తతంగం అంత ఆ అధికారి మధ్యవర్తులతో నడుపుతున్నట్టు తెలిసింది. ఇలా వారానికి ఒక్కో ఆటోకి 10 వేల చొప్పున 4 ఆటోలకు 40 వేలు ముట్టవల్సిందే అంటూ మధ్యవర్తి ద్వారా ఒత్తిడి చేసి అక్రమార్జనకుక ఆ పాల్పడుతున్నట్లు తెలిసింది. పాగింగ్ మిషన్ నడవకున్న రోజు బిల్లు మంజూరి చేసి డబ్బులు దంఫుకుంటున్నట్లు తెలిసింది. ఈ అక్రమ డీజిల్ దందా చాలా సంవత్సరాల నుంచే కొనసాగుతున్నట్లు తెలియవచ్చింది. ఉన్నతాధికారులు సైతం చూసి చూడనట్లు ఆ అధికారిని వదిలివేయడంతో ఆ అధికారి పరపతికి కార్పొరేషన్ అడ్డు లేకుండా పోయినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి ఆ అధికారి అక్రమ లెక్కలు వెలికి తీస్తారా లేదా చూడాలి.