రంగంలోకి నకిలీ విలేకరులు….!

న్యూస్ 10 పేరుతో బియ్యం వ్యాపారస్తుల వద్దకు
విలేకరి అవతారం ఎత్తిన అక్రమ బియ్యం వ్యాపారి
బియ్యం అక్రమ దందా
వరుస కథనాలతో రంగం లోకి నకిలీ విలేకరులు
హంటర్ రోడ్డు లోని ఓ బార్లో మంతనాలు జరిపినట్టు సమాచారం
ఇక వ్యాపారం సజావుగా నడుపవచ్చని భరోసా…

వరంగల్ నగరంలో నకిలీ విలేకరుల బెడద రోజారోజుకు ఎక్కువైపోతుంది… వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. పత్రికలో వచ్చిన వార్తకు వారికి ఎలాంటి సంబంధం లేకున్నా ఆ వార్త మేము రాసామంటూ వసూళ్లకు తెరతీస్తున్నారు… నకిలీలు ఇలా ఉంటే ఇంకొంతమంది ఫలానా పత్రికలో వచ్చింది మేం కూడా రాస్తాం అంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిసింది.

రంగంలోకి నకిలీ విలేకరులు....!- news10.app

గత వారం రోజులుగా ప్రజా పంపిణి బియ్యం అక్రమ రవాణాపై పూర్తి సమాచారంతో న్యూస్10 వరుస కథనాలు వెలువరుస్తోంది.. దీనిని ఆసరాగా తీసుకుని కొంతమంది నకిలీ విలేకరులు రంగంలోకి దిగారు… రేషన్ బియ్యం అక్రమదందా చేసే ఓ వ్యక్తి విలేకరి అవతారం ఎత్తి న్యూస్10 వరంగల్ తూర్పు ప్రతినిధి పేరుతో మిల్లర్లతో మిలాఖత్ అయినట్లు తెలిసింది..న్యూస్10 కథనాన్ని అవకాశం గా ఉపయోగించు కొని డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. పర్వతగిరి, సంగెం మండలాల్లో నడుస్తున్న మిల్లులకు వందల క్వింటాళ్ళ రేషన్ బియ్యం నగరం నుండి ఎదో విధంగా రవాణా చేస్తున్నారు అక్రమార్కులు… ఈ విషయం తెలిసిన న్యూస్ 10 నిఘా టీమ్ అక్రమ బియ్యం వ్యాపారం పై ఓ కన్నేసి వరుస కథనాలు ప్రచురించటం జరుగుతుంది… దీనిని అవకాశం గా మల్చుకున్న కొందరు నకిలీ, మకిలీ విలేకరులు కథనం రాసింది మేమే అని అక్కడ వ్యాపారస్తుల దగ్గర కు వెళ్లి ఓ మధ్యవర్తి తో మాట్లాడి మిల్లు యజమానుల తో హంటర్ రోడ్డు లో ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో మద్యం సేవిస్తూ మంచింగ్ కానిస్తూ మంతనాలు నడిపినట్టు విశ్వసనీయ సమాచారం.

అక్రమ బియ్యం దందా సజావుగా నడుపుకోవచ్చు. ఇక ఎలాంటి ఆటంకాలు ఉండవు అంటూ సదరు నకిలీ విలేకరులు కొంతమంది మిల్లు యజమానులకు భరోసా ఇచ్చినట్లు తెలిసింది… దింతో అక్రమ బియ్యం దందా చేసే మిల్లర్లు రేషన్ బియ్యం దందా తాము ఇక యథేచ్ఛగా జరుపుకోవచ్చని మిగతా మిల్లులకు కూడా సమాచారం చేరవేసినట్లు తెలియవచ్చింది…చేసే అక్రమ దందా ఎక్కడ ఆగుతుందోననే భయంతో మిల్లర్లు నకిలీలతో మిలాకత్ ఐయి కావాల్సింది సమర్పించినట్లు తెలిసింది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు మద్యం సేవించి అక్కడ నుండి ఎవరి దారిన వారు వెళ్లినట్టు తెలిసింది. మిల్లర్లతో మిలాకత్ ఐయిన నకిలీవిలేకర్లలో రేషన్ బియ్యం అక్రమాదందా చేసిన వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. ఇతగాడిపై ఐనవోలు పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసులు మరో మండల పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉన్నట్లు సమాచారం. ఇతనే తానే కథనం రాసానని మిల్లర్లతో నమ్మబలికినట్లు తెలిసింది.